iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?
ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
iPhone 14: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో కంపెనీ ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్లు త్వరలో ఎల్లో కలర్ వేరియంట్లో రానున్నట్లు సమాచారం. త్వరలో యాపిల్ మరో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఈ విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్లు బ్లూ, మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, రెడ్ కలర్ మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో వీటికి ఎల్లో కూడా యాడ్ అవ్వనుంది. ఈ విషయాన్ని జపనీస్ బ్లాగ్ మాక్ఒటాకరా వెల్లడించింది.
ఐఫోన్ 14, 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.
ఐఫోన్ 14తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
ప్రస్తుతం ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.71,999కే అందుబాటులో ఉంది. ఇది కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ.నాలుగు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు రూ.23 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించనున్నారు. మీరు ఈ అన్ని ఆఫర్‌లను ఉపయోగించినట్లయితే ఐఫోన్ 14ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.