iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
iPhone 13 Amazon Offer: యాపిల్ ఐఫోన్ 13పై అమెజాన్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ.40 వేలలోపు ధరకే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.
Apple iPhone 13 Offer in Amazon Great Indian Festival Sale 2024: సిరీస్‌తో సంబంధం లేకుండా యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. యాపిల్ తన తాజా సిరీస్ అయిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9వ తేదీన వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్లలో విడుదల చేసింది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయినప్పటి నుంచి పాత ఐఫోన్ మోడల్స్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో మీరు కూడా యాపిల్ ఐఫోన్‌ను చవకగా కొనుగోలు చేయాలనుకుంటే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. నిజానికి యాపిల్ ఐఫోన్ 13ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో ఐఫోన్ 13 ధర ఎంత? (iPhone 13 Price in India)
ఐఫోన్ 13ని రూ. 42,999 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు అందిస్తున్నారు. మీరు ఈ ఫోన్‌ను నెలకు రూ. 2085 ఈఎంఐపై కూడా కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఈ ఫోన్‌పై రూ. 36,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ బ్రాండ్, కండీషన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
యాపిల్ ఐఫోన్ 13 ఫీచర్లు ఎలా ఉన్నాయి?
యాపిల్ ఈ ఫోన్‌ని 2021లో లాంచ్ చేసింది. ఐఫోన్ 13లో శక్తివంతమైన ఏ15 బయోనిక్ చిప్ ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్, సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 5జీని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్‌తో మీరు గేమింగ్‌తో పాటు అద్భుతమైన ఫోటోగ్రఫీని చేయవచ్చు. ఇది ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందుతున్నప్పటికీ, కొత్త ఐఫోన్‌లు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిలోనూ మంచి పురోగతిని సాధించాయి.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఐఫోన్ 13కి చాలా క్రేజ్ ఉండేది. కొత్త ఐఫోన్ కొనాలని అనుకునేవారు ఐఫోన్ 13కి అప్‌గ్రేడ్ అయ్యేవారు. ఒక వేళ మీ బడ్జెట్ కూడా రూ. 40 వేలలోపు ఉంటే యాపిల్ ఐఫోన్ 13 మీకు గొప్ప ఆప్షన్‌గా మారవచ్చు. ఈ సేల్‌లో అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా గొప్ప ఆఫర్‌లను అందించారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
You can use your Apple Vision Pro as an enormous, private, portable display for your Mac.
— Apple Support (@AppleSupport) September 30, 2024
Here’s how to use Mac Virtual Display: https://t.co/EOhCzZ7n06 pic.twitter.com/1jMlDt7pDu
The Vitals app in #watchOS11 allows you to see key overnight health metrics in one view, and notify you when they’re outside your typical range.
— Apple Support (@AppleSupport) September 29, 2024
Learn more: https://t.co/7Q2iqqKRJ9 pic.twitter.com/rBdvbPG2Qa