అన్వేషించండి

Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!

Apple Intelligence: ఐవోఎస్ 18.1తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రావడం మొదలైంది. దీని ద్వారా ఐఫోన్‌లో చాలా టాస్క్‌లు సులభంగా చేయవచ్చు.

iOS 18.1 Top Features: యాపిల్ ఐఫోన్‌లకు ఐవోఎస్ 18.1 అప్‌డేట్‌ను రావడం మొదలైంది. ఈ అప్‌డేట్ తర్వాత ఐఫోన్ యూజర్లు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను పొందవచ్చు. అమెరికన్ టెక్ దిగ్గజం డబ్ల్యూడీసీ 2024 ఈవెంట్‌లో ఐవోఎస్ 18కు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ఆవిష్కరించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది కంపెనీ లాంచ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థ. ఇది అన్ని రకాల ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అయితే ఐవోఎస్ 18.1లో అన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు విడుదల కాలేదు. ఈ అప్‌డేట్‌లో యాపిల్ వినియోగదారులు ఎలాంటి ఫీచర్లను పొందారో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ ఇంటెలిజెన్స్‌లో ఏ ఫీచర్లు ఉంటాయి?
యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఐఫోన్ 15 ప్రో సిరీస్, ఐఫోన్ 16 సిరీస్ మోడల్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ మోడళ్ల కోసం ఐవోఎస్ 18.1 అప్‌డేట్ విడుదల అయింది. ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అనేక పనులను చేయగలరు.

మునుపటి కంటే మెరుగైన సిరి...
ఐవోఎస్ 18.1లో సిరి మరింత మెరుగు అయింది. సిరి మునుపటి కంటే మెరుగ్గా మీకు సహాయం చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీరు మునుపటి కంటే మెరుగైన విధంగా సిరికి ఆదేశాలను ఇవ్వవచ్చు. ఐవోఎస్ 18.1లో క్లీన్ అప్ టూల్ కూడా అందించారు. దీని ద్వారా మీరు తీసివేయాలనుకుంటున్న ఫొటోలో నుంచి అవసరం లేని ఆబ్జెక్ట్స్‌ను డిలీట్ చేయవచ్చు. జనరేటివ్ ఏఐ సాయంతో ఈ టాస్క్‌లు కంప్లీట్ చేయవచ్చు. ఈ ఫీచర్లను ప్రస్తుతం అమెరికాలో విడుదల చేస్తున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల కోసం భారతీయ ఐఫోన్ వినియోగదారులు 2025 ప్రారంభం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఫొటో యాప్..
ఈ ఫీచర్ సహాయంతో, మీరు కేవలం టెక్స్ట్ రాయడం ద్వారా ఫోటోలను జనరేట్ చేయవచ్చు. మీరు మెమరీ మిక్స్ నుంచి ఏదైనా క్రియేట్ చేయాలని అనుకుంటే ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఫోటో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎంపిక చేస్తుంది.

కాల్ రికార్డింగ్ సౌకర్యం కూడా...
కాల్ రికార్డింగ్ విషయంలో యాపిల్ వినియోగదారుల నిరీక్షణ ముగిసింది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు ఇప్పుడు కాల్ రికార్డింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు ఏదైనా కాల్‌ని సులభంగా రికార్డ్ చేయవచ్చు, సేవ్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు కాల్‌కు సంబంధించిన ట్రాన్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దానిని మీరు సమ్మరైజ్ చేసుకోవచ్చు.

ఫోటోలు, వీడియోలను ఈజీగా..
ఇప్పుడు గ్యాలరీలో ఫోటోలు, వీడియోలను వెతకడం మరింత ఈజీ అయింది. దీని కోసం వినియోగదారులు ఫోటోలు, వీడియోలను పేరు ద్వారా మాత్రమే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు అవసరమైన మెయిల్ సారాంశాన్ని సులభంగా చదవగలరు. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే దీని సాయంతో మీరు మీ ముఖ్యమైన మెయిల్స్‌ను కోల్పోరు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఈ ఐప్యాడ్స్‌కు సపోర్ట్
ఐప్యాడ్ ఎయిర్ (ఎం1, తర్వాతి జనరేషన్స్‌కు)
ఐప్యాడ్ ప్రో (ఎం1, తర్వాత జనరేషన్స్‌కు)
ఐప్యాడ్ మినీ
ఐప్యాడ్ (ఎం1, తర్వాత జనరేషన్స్‌కు)

యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే ఫోన్లు
ఐఫోన్ 15 ప్రో
ఐఫోన్ 16
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 16 ప్లస్
ఐఫోన్ 16 ప్రో
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

ఏ మ్యాక్ బుక్స్‌కు అందుబాటులోకి వస్తుంది?
ఎం సిరీస్ చిప్‌సెట్ ఉన్న మ్యాక్‌బుక్స్‌కు వస్తుంది.

ఐవోఎస్ 18.1 అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఈ కొత్త అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేయడం కూడా సులభం.
ముందుగా మీ ఐఫోన్‌లోని "సెట్టింగ్స్" యాప్‌కి వెళ్లండి.
దీని తర్వాత “జనరల్” అని సెర్చ్ చేసి, “సాఫ్ట్‌వేర్ అప్‌డేట్” పై ట్యాప్ చేయండి.
ఇప్పుడు ఐవోఎస్ 18.1 అప్‌డేట్ కోసం ఆన్ స్క్రీన్ కమాండ్స్‌ను ఫాలో అవ్వండి.
విజయవంతంగా ఐవోఎస్ 18.1 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
RBI: లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్ల చెక్ అందజేసిన చంద్రబాబు
ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్ల చెక్ అందజేసిన చంద్రబాబు
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Embed widget