India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!
మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది.
![India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి! Internet Speed in India Improves As 5G Rollout Country Jumps 4 Spots in Global Ranking India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/3e68650a8879f3579da2242ca44ea77d1684395071572601_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Internet Speed: జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలో వేగవంతమైన 5జీ రోల్‌అవుట్‌లో నిమగ్నమై ఉన్నాయి. రెండు కంపెనీలు భారతదేశంలోని అనేక నగరాల్లో 5జీని ప్రారంభించాయి. దేశంలో 5జీ నెట్‌వర్క్ సర్వీసు రోల్ అవుట్ వేగం పుంజుకోవడంతో సగటు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పరంగా భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్‌లో మరింత పైకి చేరుకుంది.
ఊక్లా నివేదిక ప్రకారం, భారతదేశం స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో మార్చిలో 64వ స్థానంలో ఉంది. కానీ ఏప్రిల్‌లో అది 60వ స్థానానికి చేరుకుంది. నివేదిక ప్రకారం ఏప్రిల్ 2023లో భారతదేశ మొబైల్ డేటా వేగం 115 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం 36.35 Mbpsతో పురోగతిని నమోదు చేసింది. మార్చిలో సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం 33.30 Mbpsగా ఉంది.
ఊక్లా అంటే ఏంటి?
Ookla's Speedtest Global Index నెలవారీ ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా మొబైల్, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని ర్యాంక్ చేస్తుంది. స్పీడ్‌టెస్ట్ ఉపయోగించి నెలవారీ పరీక్ష ద్వారా దీన్ని నిర్థారిస్తారు.
ఇతర దేశాల సంగతేంటి?
ఊక్లా ఏప్రిల్ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం సెనెగల్ దేశం అత్యధిక ర్యాంక్ పెరుగుదలను నమోదు చేసింది. అయితే మొత్తం గ్లోబల్ మీడియన్ మొబైల్ స్పీడ్‌లో ఖతార్ నంబర్ వన్‌గా ఉంది. మొత్తం ఫిక్స్‌డ్ గ్లోబల్ మీడియన్ స్పీడ్ పరంగా చూసుకుంటే బహ్రెయిన్ ర్యాంక్‌లో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. గ్లోబల్ ఫిక్స్‌డ్ మీడియన్ స్పీడ్‌లో సింగపూర్ తన నంబర్ వన్ స్థానంలో అలాగే కొనసాగుతోంది.
భారత్ లో 5G నెట్ వర్క్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ లాంటి సెల్యూలార్ కంపెనీలు రోజు రోజు 5G నెట్ వర్క్ పరిధిని విస్తృతం చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 60 నగరాలు, పట్టణాల ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వచ్చే ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి తేనున్నట్లు జియో వెల్లడించింది. అటు 2024 చివరి నాటికి దేశమంతటా 5G సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) చైర్మన్ పంకజ్ మొహింద్రూ కీలక విషయాలను వెల్లడించారు.
దేశంలో ఇప్పటికే 60 నగరాలు, పట్టణాలు కొత్త సాంకేతికతను ఆస్వాదిస్తున్నట్లు పంకజ్ తెలిపారు. 2023 చివరి నాటికి, 75-80 శాతం కొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అవుతాయని చెప్పారు. ఇవన్నీ 5G నెట్ వర్క్ కు సపోర్టు చేసేలా ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను అధికారికంగా ప్రారంభించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. 2023 చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభ నెలల్లో దేశ వ్యాప్తగా ఈ సేవలు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. “దేశంలో 5G టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ 5G టెక్నాలజీని కొత్త తరం టెలికాం పరికరాల తయారీదారులు, అప్లికేషన్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్-2-మెషిన్ (M2M), హెల్త్ కేర్ సర్వీసెస్, ఇతరులతో కలిసి మరింత సమర్థవంతంగా ఈ సేవల పరిధిని పెంచుతున్నాం” అని పంకజ్ మొహింద్రూ వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)