Infinix Zero 5G Launched: మొదటి 5జీ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ, తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!
ఇన్‌ఫీనిక్స్ మొదటి 5జీ ఫోన్ ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999గా ఉంది.
Infinix Zero 5G India Launch: ఇన్‌ఫీనిక్స్ మొట్టమొదటి 5జీ ఫోన్ జీరో 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 5జీ (MediaTek Dimensity 900) ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు 48 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు అందించడం విశేషం. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే కూడా ఉంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ ధర (Price)
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.19,999గా నిర్ణయించారు. కాస్మిక్ బ్లాక్, స్కైలైట్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. సిటీబ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 క్యాష్‌బ్యాక్ కూడా అందించనున్నారు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారు ఇన్‌ఫీనిక్స్ స్నోకోర్ (ఐరాకర్) వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను రూ.1కే కొనుగోలు చేయవచ్చు.
ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ స్పెసిఫికేషన్లు (Specifications)
ఆండ్రాయిడ్ 11 (Android 11) ఆధారిత ఎక్స్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 5జీ ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా... 30x జూమ్ కెపాసిటీని ఈ సెన్సార్‌లో అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా కంపెనీ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది.
5జీ, ఎఫ్ఎం రేడియో, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, జీ-సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!