Smartphone Exports: చైనాకు చెక్ పెట్టే దిశగా భారత్ - స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారీ జంప్!
Smartphone Exports Increased: ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు బాగా పెరిగాయి. ఐఫోన్ల ఎగుమతి ఏకంగా 177 శాతం వృద్ధి సాధించింది.
Smartphone Export: స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో దేశం ముందుకు దూసుకుపోతుంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏడు నెలల్లో స్మార్ట్‌ఫోన్‌ల ఎక్స్‌పోర్ట్ డేటాను షేర్ చేశారు. ఇందులో దేశం అత్యధిక సంఖ్యలో ఐఫోన్‌లను విదేశాలకు పంపిందని వెల్లడించారు. అలాగే భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య గత 7 నెలల్లో 60 శాతం పెరిగింది. మరోవైపు ఐఫోన్ల ఎగుమతిలో 177 శాతం వృద్ధి కనిపించింది. అదే సమయంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణ గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో మొత్తం 4.97 బిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో దాదాపు రూ.41 వేల కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సగటున ప్రతి నెలా ఒక బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అవుతున్నాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్వీట్‌లో తెలిపారు. ప్రభుత్వ డేటా ప్రకారం కంపెనీ భారతదేశంలోని తన ముగ్గురు వెండర్ల ద్వారా 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వార్షిక ప్రాతిపదికన భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతిలో 61 శాతం వృద్ధి నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ పథకం కింద యాపిల్ మూడో సంవత్సరం కూడా భారతదేశంలో తన తయారీని పెంచింది. దీంతో ఐఫోన్ మార్కెట్ షేర్ గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఐఫోన్ వాటా 62 శాతంగా ఉంది. దీని తర్వాతి స్థానంలో మిగిలిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. గతేడాది 5.8 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఇందులో ఐఫోన్ వాటా 22 శాతంగా ఉంది.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యం ద్వారా ఐఫోన్‌లను తయారు చేస్తున్నాయి. విస్ట్రాన్‌ను ఇటీవలే టాటా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసింది. ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో తయారు అయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ భారతదేశంలో ఏడు శాతం ఐఫోన్‌లను తయారు చేసింది. స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా భారత్ దూసుకుపోతుంది.
మరోవైపు వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి తర్వాతి వెర్షన్‌గా వన్‌ప్లస్ ఏస్ 3 మార్కెట్లోకి రానుంది. వన్‌ప్లస్ ఏస్ 3కి సంబంధించి ఇప్పటికే చాలా లీకులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఇంతకు ముందే లీకయ్యాయి. వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉండనుందని సమాచారం. 1.5కే కర్వ్‌డ్ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో ఉండనుందని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ ఏస్ 3 పని చేయనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!