Wi-Fi password: వైఫై పాస్ వర్డ్ మర్చిపోయారా? జస్ట్ ఇలా చేస్తే చాలు!
మీ వైఫై పాస్ వర్డ్ మర్చిపోయారా? దాన్ని ఎక్కడా సేవ్ చేసి పెట్టుకోలేదా? అయినా కంగారు పడకండి. జస్ట్ మీ ఫోన్ ద్వారా పాస్ వర్డ్ తెలుసుకునే అవకాశం ఉంది.
వైఫై వినియోగదారులకు తరుచుగా ఎదురయ్యే సమస్య పాస్ వర్డ్ మర్చిపోవడం. సాధారణంగా ఎప్పుడో ఒకసారి ఇంట్లో, లేదంటే ఆఫీసులో వైఫైకి డివైజెస్ కనెక్ట్ చేస్తారు. నిత్యం నెట్ వాడుతూనే ఉంటారు. కాబట్టి పాస్ వర్డ్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కొద్ది రోజుల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కుటుంబ సభ్యులకు, లేదంటే మిత్రులకు సంబంధించిన ఫోన్లకు కనెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సమస్య ఎదురవుతుంది. అప్పుడు పాస్ వర్డ్ తెలియక ఇబ్బంది కలుగుతుంది. అయితే, వైఫై పాస్ వర్డ్ ని ఎక్కడా సేవ్ చేయకున్నా.. తెలుసుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి.
వాస్తవానికి చాలా మందికి ప్రతి రోజు ఇంటర్నెట్ సదుపాయం చాలా అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, నెట్ జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే డేటా వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరు సొంత వైఫై కలిగి ఉంటే.. మీ రౌటర్ ను స్ట్రాంగ్ పాస్ వర్డ్ తో లాక్ చేసుకోవాలి. ఈ పాస్ వర్డ్ మర్చిపోయినా.. కనెక్ట్ అయి ఉన్న ఆండ్రాయిడ్ 10తో పాటు అంతకంటే ఎక్కువ వెర్సన్ లలో కనుకొనే అవకాశం ఉంది. మీరు మీ సేవ్ చేసిన నెట్ వర్క్ పాస్ వర్డ్ ను ఎలా చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంతకు ముందు కనెక్ట్ చేసిన నెట్ వర్క్ ల పాస్ వర్డ్ లు మాత్రమే చూసేందుకు వీలు కలుగుతుంది. మీరు ఎన్నడూ కనెక్ట్ చేయని నెట్ వర్క్ వైఫై పాస్ వర్డ్ గుర్తించడం సాధ్యం కాదు. ఈ కింది పద్దతిని ఫాలో అయితే మీ వైఫై పాస్ వర్డ్ ను చూసే అవకాశం ఉంటుంది.
ఆండ్రాయిడ్ లో మీ Wi-Fi పాస్వర్డ్ను ఎలా చూడాలంటే?
1: మీ ఫోన్ సెట్టింగ్‌లను ముందుగా ఓపెన్ చేయండి.
2: ఆ తర్వాత Wifi సెక్షన్ ను తెరవండి.
3: కనెక్ట్ చేయబడిన Wifi యొక్క సెట్టింగ్ ఎంచుకోండి.
4: తర్వాత షేర్ పై నొక్కండి.
5: భద్రతా కారణాల దృష్ట్యా పిన్, ఫేస్ రికగ్నిషన్, పాస్‌వర్డ్ మొదలైనవాటిని ఎంటర్ చేయడం మూలంగా మీరేనని ధృవీకరించుకోవాలి.
6: ఇప్పుడు మీకు QR కోడ్, దాని క్రింద పాస్ వర్డ్ తో కనిపిస్తుంది.
iOS 16లో Wi-Fi పాస్వర్డ్ను ఎలా చూడాలంటే?
1: ముందుగా మీ ఫోన్సెట్టింగ్ యాప్ ని తెరవండి.
2: సెట్టింగ్‌లో Wifi సెక్షన్ ని ఓపెన్ చేయండి.
3: WiFi విభాగంలో బ్లూ ఇన్ఫర్మేషన్ సింబల్ ని నొక్కాలి.
4: మీరు మీ నెట్‌వర్క్ వివరాల కోసం స్క్రీన్ ఓపెన్ చేయాలి. పాస్‌వర్డ్ ఖాళీగా ఉన్న అనేక ఎంపికలను మీరు గమనించవచ్చు.
5: మీరు పాస్ వర్డ్ ను కాపీ చేసి.. డిస్ ప్లే చేయబడే పాప్-అప్ విండోలోని కాపీ బటన్ ను నొక్కండి. ఆపై పాస్ వర్డ్ ను కావాల్సిన చోట్ పేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?