Internet Speed Test: మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!
మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరు అనుకున్న డేటా స్పీడ్ అందిస్తుందా? మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొన్నిసార్లు స్లోగా పని చేసినట్లు అనిపిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే జస్ట్ స్పీట్ టెస్ చేయాల్సిందే!
ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేయడానికి చాలా వెబ్ సైట్లు, యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటితో పోల్చితే గూగుల్ ద్వారా ఈజీగా స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గం. ఈ పద్దతిలో సుమారు ఐదు స్టెప్స్ ద్వారా ఇంటర్నెట్ స్పీట్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ వేగాన్ని టెస్ట్ చేసే ప్రక్రియను రూపొందించేందుకు Google Measurement Lab (M-Lab)తో జతకట్టింది. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేయడానికి మీరు మెజర్‌మెంట్ ల్యాబ్ (M-Lab)కి లింక్ కావాల్సి ఉంటుంది. మీ IP అడ్రస్‌ను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవసీ గైడ్ లైన్స్ ప్రకారం స్పీడ్ టెస్ట్ ప్రాసెస్ చేస్తారు.
స్పీడ్ టెస్ట్ కోసం 5 స్టెప్స్
Google హోమ్‌పేజీ నుంచి మీ ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించడానికి ఐదు దశలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో చూడండి.
స్టెప్1: మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌ని తెరిచి Google.com అని టైప్ చేయండి.
స్టెప్ 2: అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో 'రన్ స్పీడ్ టెస్ట్' అని టైప్ చేయండి.
స్టెప్ 3: 'ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్' ఎంపికతో కొత్త డైలాగ్ బాక్స్ డిస్ ప్లే అవుతుంది. "మీ ఇంటర్నెట్ వేగాన్ని 30 సెకన్లలోపు తనిఖీ చేయండి" అనే డైలాగ్ బాక్స్ క్లిక్ చేయాలి. వాస్తవానికి స్పీడ్ టెస్ట్ సాధారణంగా 40 MB కంటే తక్కువ డేటాను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అయితే వేగవంతమైన కనెక్షన్‌లలో ఎక్కువ డేటాను ట్రానస్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది.
స్టెప్ 4: విండోలో, 'రన్ స్పీడ్ టెస్ట్' ఎంపికను క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ ఇంటర్నెట్ వేగానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శించే కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీరు మీ ఇంటర్నెట్ వేగాన్ని మళ్లీ పరీక్షించాలనుకుంటే, 'మళ్లీ పరీక్షించండి' అనే దానిపై క్లిక్ చేయండి. మీ ఇంటర్నెట్ స్పీడ్ వివరాలు కాసేపట్లో కనిపిస్తాయి.
ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లో భారత్ ఫర్వాలేదు!
US-ఆధారిత బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లా ప్రకారం.. భారతదేశంలో ఇంటర్నెట్ వేగం గడిచిన కొంత కాలంగా చాలా మెరుగు పడినట్లు వెల్లడించింది. ఫిక్స్ డ్ బ్రాడ్‌బ్యాండ్ , మొబైల్ డౌన్‌లోడ్ వేగం ఆధారంగా ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ స్పీడ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 70వ స్థానంలో నిలిచింది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌లో కూడా భారతదేశం బాగానే వృద్ధి సాధించింది. గత ఏడాది జూన్‌లో సగటు డౌన్‌లోడ్ వేగం 58.17Mbpsగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత స్పీడ్ కాస్త తగ్గినా మళ్లీ వేగం పుంజుకున్నది. భారతదేశంలో మొత్తం ఫిక్స్ డ్ డౌన్‌లోడ్ వేగం అత్యుత్తమంగా ఉందని గ్లోబల్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది.
Read Also: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్, డిస్‌ప్లే ఫీచర్లు లీక్!