Google Pixel Fold: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్, డిస్‌ప్లే ఫీచర్లు లీక్!
గూగుల్ నుంచి సరికొత్తగా విడుదల కాబోతున్న ‘గూగుల్ పిక్సెల్ ఫోల్డ్’ ఫోన్ సూపర్ డూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు లీక్ అయ్యాయి.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ గురించి ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ ఫోన్ ప్రియులు ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ ను ‘గూగుల్ పిక్సెల్ ఫోల్డ్’ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నది. తాజాగా ఈ స్మార్ట్ ఫోక్ కు సంబంధించిన కీలక ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. ఆన్ లైన్ వేదికగా ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్ ప్లే ఫీచర్లు బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లేను శాంసంగ్ కంపెనీ రూపొందించింది.
శాంసంగ్ కు చెందిన ప్రైమరీ, కవర్ డిస్ప్లేలు
91 మొబైల్స్ నివేదిక ప్రకారం.. 7.58-అంగుళాల పిక్సెల్ ఫోల్డ్ తో ఈ డిస్ ప్లే రూపొందింది. ఇన్నర్ డిస్‌ప్లే 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇన్నర్ డిస్‌ప్లే 1840×2208 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్ ఫోన్ శాంసంగ్ కు చెందిన ప్రైమరీ, కవర్ డిస్‌ప్లేలతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైమరీ డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ గా ఉండబోతుంది. ఫోల్డ్ చేసినప్పుడు కనిపించే కవర్ డిస్‌ప్లేకు గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఈ రెండు డిస్ ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి.
సోని ట్రిఫుల్ కెమెరా సెటప్
అటు కెమెరాకు సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. తాజా లీకుల ప్రకారం గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ వెనుక త్రిఫుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. సోని IMX787 ప్రైమరీ కెమెరా, సోని IMX386 అల్ట్రా వైడ్ కెమెరా, ఇన్నర్ ప్రైమరీ డిస్‌ప్లేకు సోని IMX355 కెమెరా ఉంటుంది. కవర్ డిస్‌ప్లేకు S5K3J1 సెన్సార్ తో కూడిన ఫ్రంట్ కెమెరా అమర్చినట్లు తెలుస్తున్నది.
[Exclusive] Google Pixel Fold display specifications revealedhttps://t.co/fI2uwNpDeK
— 91mobiles (@91mobiles) October 14, 2022
వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో విడుదల!
వాస్తవానికి గూగుల్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ను 6 సిరీస్‌తో పాటు గత ఏడాదే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి స్థాయిలో ఈ స్మార్ట్ ఫోన్ రెడీ కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. అటు డిజైన్ లోనూ పలు మార్పులు చేర్పులు చేస్తుండటంతో ఇంకాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో పిక్సెల్ ఫోల్డ్ ను లాంచ్ చేసేలా గూగుల్ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చైనాలో రెడీ అవుతుంది. ఫాక్స్ కాన్ యూనిట్ లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఫోన్ కు సంబంధించి ఎలాంటి వివరాలను గూగుల్ కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినా, ఆన్ లైన్ వేదికగా ఈ ఫోన్ కు సంబంధించి పలు వివరాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా రెడీ అయ్యాకే, విడుదల తేది సహా ఫీచర్లు, రేట్ల గురించి గూగుల్ కంపెనీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
Also Read: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!
వీవో నుంచి కూడా..: వివో కూడా ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అయితే, ఇండియన్ మార్కెట్లోకి రావడానికి టైమ్ పట్టవచ్చు. వీవో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో సెప్టెంబర్ 26వ తేదీన లాంచ్ చేశారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అలెర్ట్ స్లైడర్ ఫోన్ ఎడమవైపు ఉంది. బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.