News
News
X

Honor 30 Plus 5G: రూ.13 వేలలోనే 5జీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన చవకైన 5జీ ఫోన్ 30 ప్లస్ 5జీని లాంచ్ చేసింది.

FOLLOW US: 

హానర్ ప్లే 30 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇది ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

హానర్ ప్లే 30 ప్లస్ 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,099 యువాన్లుగా(సుమారు రూ.13,100) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగానూ(సుమారు రూ.15,500), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగానూ(సుమారు రూ.17,900) ఉంది. మ్యాజిక్ నైట్ బ్లాక్ షేడ్, చార్మ్ సీ బ్లూ, డాన్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హానర్ ప్లే 30 ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.74 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్‌కు అందించారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకమైన స్లాట్‌ను అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వెనకవైపు కెమెరాలో స్కిన్ బ్యూటిఫికేషన్, పనోరమ, హెచ్‌డీఆర్, వాయిస్ కంట్రోల్ ఫొటోగ్రఫీ, టైమ్డ్ ఫొటోగ్రఫీ, ఏఐ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఏజీపీఎస్, ఓటీజీ యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, వైఫై వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Dec 2021 06:19 PM (IST) Tags: Honor Honor 30 Plus 5G Launched Honor 30 Plus 5G Price Honor 30 Plus 5G Specifications Honor 30 Plus 5G Features Honor 30 Plus 5G Honor Cheapest 5G Phone

సంబంధిత కథనాలు

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

iQoo 11 Pro Camera: ఐకూ 11 సిరీస్ ఫీచర్లు లీక్ - ప్రపంచంలోనే టాప్ కెమెరాలతో!

iQoo 11 Pro Camera: ఐకూ 11 సిరీస్ ఫీచర్లు లీక్ - ప్రపంచంలోనే టాప్ కెమెరాలతో!

Realme 10: రియల్‌మీ 10 లాంచ్ దగ్గరలో - ఫీచర్లు లీక్ - టెస్టింగ్‌లో సూపర్ స్కోరు!

Realme 10: రియల్‌మీ 10 లాంచ్ దగ్గరలో - ఫీచర్లు లీక్ - టెస్టింగ్‌లో సూపర్ స్కోరు!

Infinix Zero Ultra 5G Launch: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ లాంచ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగు సినిమాల్లోనే సగం చార్జింగ్!

Infinix Zero Ultra 5G Launch: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ లాంచ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగు సినిమాల్లోనే సగం చార్జింగ్!

Samsung Frame TV: టీవీ కొంటే ఫోన్లు ఫ్రీ - శాంసంగ్ కొత్త టీవీలపై బంపర్ ఆఫర్!

Samsung Frame TV: టీవీ కొంటే ఫోన్లు ఫ్రీ - శాంసంగ్ కొత్త టీవీలపై బంపర్ ఆఫర్!

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!