అన్వేషించండి

GOVT WARNING: స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన!

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పలు ఆడ్రాయిడ్ ఫోన్లలోకి హ్యకర్లు చొరబడి కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.  ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12 ఎల్ తో పాటు ఆండ్రాయిడ్ 13తో రన్ అయ్యే స్మార్ట్‌ ఫోన్‌ లు, టాబ్లెట్‌ల యూజర్లను ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ టీమ్ హెచ్చరిక చేసింది. ఈ Google Android వెర్షన్‌ లలో మల్టీఫుల్ వెర్నలబిటీస్ ఉన్నట్లు CERT-In నివేదిక వెల్లడించింది.  వీటిని రిమోట్ అటాకర్ ద్వారా టార్గెటెడ్ సిస్టమ్ నుంచి కీలకమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని వెల్లడించింది.   

లోపాల గురించి CERT-In ఏమి చెప్తుందంటే?

CERT-In ప్రకారం..  ఆండ్రాయిడ్ రన్‌టైమ్, ఫ్రేమ్‌ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌ డేట్‌ లు, కెర్నల్, కెర్నల్ భాగాలు, ఇమాజినేషన్ టెక్నాలజీస్, మీడియాటెక్ కాంపోనెంట్‌ లు, యూనిసోక్ కాంపోనెంట్‌ లు, క్వాల్‌ కామ్ కాంపోనెంట్‌ లు,  క్వాల్‌ కామ్ క్లోస్డ్ సోర్స్ లోపాల కారణంగా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ లో ప్రమాదం ఉందని గుర్తించింది. ఈ లోపాలను హ్యాకర్లు సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. వీటిని బేస్ చేసుకుని టార్గెట్ చేసిన డివైజెస్ నుంచి కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది. 

హ్యాకింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలంటే?  

కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో గూగుల్ చర్యలు చేపట్టింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం గూగుల్ తాజాగా Android సెక్యూరిటీ ప్యాచ్‌ ని విడుదల చేసింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని.. ఆయా డివైజ్ లలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం మూలంగా హ్యాకింగ్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. అటు ఈ  ప్యాచ్‌ ని డౌన్‌ లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి లింక్‌లను CERT-In వెబ్‌ సైట్‌ లో పొందు పరిచారు.

గూగుల్ ప్లే స్టోర్‌ లో ప్రమాదకరమైన మాల్వేర్

ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లే స్టోర్ లో ప్రమాదకరమైన మాల్వేర్‌ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ గా గుర్తింపు పొందిన షార్క్‌బాట్(SharkBot) మరోసారి గూగుల్ ప్లే స్టోర్ (Google Playstore)లో కనిపించినట్లు వెల్లడించారు. యాంటీ వైరస్, క్లీనర్‌ లాంటి యాప్‌ల రూపంలో ఈ మాల్వేర్ ఉన్నట్లు  కనుగొన్నారు. మిస్టర్ ఫోన్ క్లీనర్(Mister Phone Cleaner), కిల్ హెవీ మోబైల్ సెక్యూరిటీ(Kylhavy Mobile Security) లాంటి నకిలీ యాంటీ వైరస్, క్లీనర్ యాప్స్ లో ఈ మాల్వేర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మాల్వేర్ ప్రధానంగా బ్యాంకింగ్ తో పాటు క్రిప్టోకు సంబంధించిన డేటాను సేకరిస్తుంది. ఆయా అకౌంట్లకు సంబంధించిన వివరాలను దొంగిలిస్తుంది. ఫింగర్ ప్రింట్స్ సహా ఇతర వివరాలను ఈజీగా సేకరిస్తుంది.  

ఈ మాల్వేర్ ఎలా పని చేస్తుందంటే?

షార్క్‌ బాట్ డ్రాపర్‌ గా పిలిచే ఈ మాల్వేర్.. ఆయా యాప్‌ల ద్వారా వినియోగదారుల ఫోన్లలో ఇన్‌స్టాల్ అయిన తర్వాత పని చేయడం మొదలు పెడుతుంది. వెంటనే లాగిన్ విత్ ఫింగర్ ప్రింట్ అనే సెక్యూరిటీ ఆప్షన్ ను తొలగిస్తుంది. దీంతో కస్టమర్లు తమ పాస్ వర్డ్, యూజర్ వివరాలను టైప్ చేస్తారు. ఈ వివరాలను మాల్వేర్ సేకరిస్తుంది. వాస్తవానికి  మాల్వేర్ ల నుంచి రక్షణ పొందడానికి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తుంది. వినియోగదారులు నమ్మి  ఇన్ స్టాల్ చేస్తే.. ఇక అంతే సంగతులు. వారి ఫోన్ వివరాలన్నీ సేకరిస్తుంది. అనంతరం ఆటోమేటిక్ సిస్టమ్ ట్రాన్స్ ఫర్ పద్దతిని ఉపయోగించి.. ఆయా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును ఆటోమేటిక్ గా ట్రాన్స్ ఫర్ చేస్తుంది. 

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget