UPI Update: మీరు యూపీఐ అకౌంట్లు వాడుతున్నారా? - ఇలా చేయకపోతే జనవరి 1 నుంచి డీయాక్టివేట్!
Inactive UPI Accounts: ఇన్ యాక్టివ్ యూపీఐ అకౌంట్లను డీయాక్టివేట్ చేయాల్సిందిగా గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయంలను ఎన్‌పీసీఐ ఆదేశించింది.
Phonepe Inactive Accounts: మీరు నగదు లావాదేవీల కోసం యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారా? అయితే మీ కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జీపే, పేటీయం, ఫోన్‌పే, భారత్‌పే వంటి అన్ని యూపీఐ యాప్‌ల్లో ఇన్‌యాక్టివ్ అకౌంట్లను మూసివేయమని ఆదేశించింది. గత ఏడాది కాలంగా తమ యూపీఐ ఐడీని ఉపయోగించని వ్యక్తుల యూపీఐ ఖాతాలు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయన్న మాట. డిసెంబర్ 31వ తేదీ తర్వాత అన్ని కంపెనీలు అటువంటి ఖాతాలను మూసివేయడం ప్రారంభిస్తాయి.
ట్రాయ్ నిర్ణయం కారణంగా...
ట్రాయ్ ఆర్డర్ ప్రకారం టెలికాం కంపెనీలు 90 రోజుల తర్వాత మరొక యూజర్‌కు డీయాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్‌ను జారీ చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి 90 రోజుల పాటు నంబర్‌ను ఉపయోగించకపోతే అది మరొక వ్యక్తికి ఇస్తారు. అదే నంబర్ పాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాతో అటాచ్ అయి దాన్ని అతను కొత్త నంబర్‌తో అప్‌డేట్ చేయనప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది అంటే ఆ నంబర్ ఎవరికి లభిస్తుందో వారు పాత యూజర్ యూపీఐ యాప్‌లను యాక్టివేట్ చేయగలరు.
ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి గత ఏడాది కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అన్ని అకౌంట్లను మూసివేయాలని NPCI... యూపీఐ యాప్‌లను ఆదేశించింది. కాబట్టి 2024 జనవరి 1వ తేదీ నుంచి చాలా యూపీఐ ఖాతాలు క్లోజ్ కానున్నాయన్న మాట.
ఒక సంవత్సరం పాటు UPI యాప్ ద్వారా ఎలాంటి ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల యూపీఐ ఐడీ, అనుబంధిత యూపీఐ నంబర్, ఫోన్ నంబర్‌ను గుర్తించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ద్వారా టీపీఏపీ, పీఎస్‌పీ బ్యాంకులను నిర్దేశించింది.
అటువంటి కస్టమర్‌ల యూపీఐ ఐడీ, యూపీఐ నంబర్‌ను ఇన్‌వర్డ్ క్రెడిట్ లావాదేవీల నుంచి బ్లాక్ చేయమని, యూపీఐ మ్యాపర్ నుంచి వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరింది. ఇన్‌వర్డ్ క్రెడిట్ లావాదేవీలను రీస్టార్ చేయడానికి వినియోగదారులు వారి యూపీఐ యాప్‌తో మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి. వారి యూపీఐ ఐడీని లింక్ చేయాలి.
మరోవైపు వివో ఇటీవలే ఎక్స్100 సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. జనవరి 4వ తేదీన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు మన మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అధికారిక లాంచ్‌కు ఒక వారం ముందు ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ధరలు మనదేశంలో రూ.63,999 నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!