అన్వేషించండి

Google Pixel 9 Pro Fold: ఇండియాలో గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ - పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ వచ్చేసింది!

Google Pixel 9 Pro Fold Launched: టెక్ దిగ్గజం గూగుల్ మనదేశంలో మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్. దీని ధర రూ.1,72,999గా నిర్ణయించారు.

Google Pixel 9 Pro Fold Launched in India: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ని కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. గూగుల్ హార్డ్ వేర్ లాంచ్ ఈవెంట్లో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఇది రెండో పిక్సెల్ పిక్సెల్ బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్. మనదేశంలో లాంచ్ అయిన మొదటి గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే. ఎందుకంటే ఇంతకు ముందు వెర్షన్ మనదేశంలో లాంచ్ కాలేదు. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ గూగుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌పై పని చేయనున్నాయి. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లో 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 4650 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర (Google Pixel 9 Pro Fold Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.1,72,999గా నిర్ణయించారు. ఆబ్సీడియన్, పోర్స్‌లెయిన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇంతకు ముందు గూగుల్ పిక్సెల్ సిరీస్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్ అవుట్ లెట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఢిల్లీ, బెంగళూరుల్లో ఉన్న గూగుల్ వాక్ ఇన్ సెంటర్లలో కూడా ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు (Google Pixel 9 Pro Fold Specifications)
కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఈ ఫోన్‌కు ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, పిక్సెల్ డ్రాప్ అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. గూగుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. దీంతోపాటు టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ను కూడా అందించారు. ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ ఉంది.

ఇందులో 8 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ సూపర్ యాక్చువల్ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏకంగా 2700 నిట్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనున్నారు. బయటవైపు 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని ఫీచర్లన్నీ ఔటర్ స్క్రీన్ తరహాలోనే ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లో బయటవైపు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాను అందించారు. 5x ఆప్టికల్ జూమ్, 20x సూపర్ రెస్ జూమ్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో అందించారు. కవర్ డిస్‌ప్లేపై ఒక 10 మెగాపిక్సెల్ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో ఒక 10 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. యాడ్ మీ, హ్యాండ్స్ ఫ్రీ ఆస్ట్రో ఫొటోగ్రఫీ, ఫేస్ అన్‌బ్లర్, టాప్ షాట్, ఫ్రీక్వెంట్ ఫేసెస్, వీడియో బూస్ట్, విండ్ నాయిస్ రిడక్షన్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్, మాక్రో ఫోకస్ వీడియో, మేడ్ యు లుక్, మ్యాజిక్ ఎడిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. యూఎస్‌లో 512 జీబీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, అల్ట్రా వైడ్ బ్యాండ్, యూఎస్‌బీ 3.2 టైప్-సీ పోర్టులను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4650 ఎంఏహెచ్ కాగా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP DesamRCB IPL 2025 Retention Players | కింగ్  Virat Kohli పట్టాభిషేకానికి మళ్లీ ముహూర్తం.? | ABP DesamMumbai Indians Retained Players 2025 | హిట్ మ్యాన్ ఉన్నాడు..హిట్ మ్యాన్ ఉంటాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Crime News: 'పుష్ప' సీన్ రిపీట్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మించేలా, కాకపోతే ఇక్కడ గంజాయి
'పుష్ప' సీన్ రిపీట్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మించేలా, కాకపోతే ఇక్కడ గంజాయి
Embed widget