Google Pixel 8 Price Drop: గూగుల్ పిక్సెల్ 8పై భారీ తగ్గింపు - ఏకంగా రూ.22 వేల వరకు!
Google Pixel 8 Price in India: టెక్ దిగ్గజం గూగుల్ గతంలో మనదేశంలో పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించారు. దీన్ని రూ.54 వేల ధరలోపే కొనుగోలు చేయవచ్చు.
Google Pixel 8 Price Cut: గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ గతేడాది అక్టోబర్‌లో మనదేశంలో లాంచ్ అయింది. సంవత్సరం తిరిగే లోపే దీని ధరను మనదేశంలో భారీగా తగ్గించారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభించనుంది. గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్‌పై గూగుల్ పిక్సెల్ 8 పని చేయనుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4575 ఎంఏహెచ్‌గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 8 ధర (Google Pixel 8 Price)
గూగుల్ పిక్సెల్ 8లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో రూ.75,999 ధరతో లాంచ్ అయింది. దీన్ని ఇప్పుడు రూ.61,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే దీని ధరపై ఏకంగా రూ.14 వేలు తగ్గింపు లభించిందన్న మాట. అలాగే రూ.82,999 ధరతో లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.71,999కు తగ్గింది.
దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు రూ.8,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే రూ.53,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏకంగా రూ.22,000 తగ్గింపు గూగుల్ పిక్సెల్ 8పై తగ్గిందనుకోవాలి. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.699 విలువైన స్పాటిఫై ప్రీమియంను ఉచితంగా అందించనున్నారు. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.3,445 నుంచి ప్రారంభం కానుంది.
Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్
గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు (Google Pixel 8 Price Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 8 పని చేయనుంది. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్‌పై గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్, 12 జీబీ వరకు ర్యామ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ అందించారు.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్2 సెన్సార్‌ను అందించారు. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4575 ఎంఏహెచ్ కాగా, 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
#TeamPixel, switch it up with a new #FeatureDrop!
— Made by Google (@madebygoogle) June 11, 2024
🧠Gemini Nano on #Pixel8 & #Pixel8a
📍Find My Device when it's dead
📷Manual lens selection & improved HDR+
⌚Google Home, PayPal & Car Crash Detection on #PixelWatch
🤯& more!*
*See video & learn more: https://t.co/CicbVVasCl pic.twitter.com/ISgDbawsuX
Also Read: రియల్‌మీ నార్జో ఎన్63 సేల్ ప్రారంభం - రూ.8 వేలలోపే బడ్జెట్ ఫోన్!