అన్వేషించండి

Google I/O 2024: గూగుల్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ డేట్ చెప్పేశారు - జెమిని ఏఐ కొత్త ఫీచర్లు, ఆండ్రాయిడ్ 15 అనౌన్స్‌మెంట్లు ఆరోజే?

Google I/O 2024 Date: గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ను మే 14న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

Google I/O 2024 Announcements: గూగుల్ తన తర్వాతి ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ను మే 14వ తేదీన నిర్వహించనుంది. దీని కోసం కంపెనీ ‘బ్రేక్ ది లూప్ పజిల్’ను కూడా నిర్వహించింది. సాధారణంగా ఐ/వో కాన్ఫరెన్స్ నిర్వహించే తేదీలను గూగుల్ ఇలా పజిల్ రూపంలో వెల్లడిస్తుంది. ఇది ఒక ఇన్ పర్సన్ ఈవెంట్. అంతే కాకుండా గూగుల్ అధికారిక ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. 

గూగుల్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఈవెంట్లో కంపెనీ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది. ఈ సారి గూగుల్ ఏఐ విభాగంలో తను చేసిన లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్లను ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను కూడా రివీల్ చేయనుందని తెలుస్తోంది. జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫీచర్లు కూడా ప్రకటించనున్నారు.

దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వెబ్ సైట్‌ ద్వారా గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ డేట్‌ను రివీల్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మౌంటెయిన్ వ్యూలోని షోర్‌లైన్ యాంఫీ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి యేటా ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడే నిర్వహిస్తున్నారు. గూగుల్ కీనోట్‌ను ఐ/వో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చేయనుంది. 

డెవలపర్ సెషన్ మాత్రం కేవలం హాజరైన వారికి మాత్రమే జరగనుందని అనుకోవచ్చు. ఇంతకు ముందు లాగానే ఈ సారి కూడా డెవలపర్లు ఈవెంట్ కోసం ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. గూగుల్ ఏఐ జెమిని, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ గురించి ప్రకటనలు ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వస్తాయని సమాచారం. అంతే కాకుండా గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ 15, ఇతర గూగుల్ ఉత్పత్తులకు సంబంధించిన ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేయనుంది.

2023 ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏను కంపెనీ రివీల్ చేసింది. దీన్ని బట్టి మేలో జరగనున్న ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్ ఫోన్‌ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందని అంచనా. ఈ ఫోన్‌లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని వార్తలు వస్తున్నాయి. గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సార్ జీ3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుందని తెలుస్తోంది. 8 జీబీ వరకు ర్యామ్ ఉంటుందని అంచనా. గూగుల్ పిక్సెల్ 7ఏ కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ ఖరీదు ఎక్కువగా ఉండనుందని లీకులు వస్తున్నాయి.

గతేడాది జరిగిన ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గూగుల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ అయిన గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాబట్టి ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ 2, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌కు సంబంధించిన టీజర్లను కూడా రివీల్ చేస్తుందని అంచనా.

గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫర్మెన్స్‌ను 2008 సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించింది. కోవిడ్ కారణంగా 2020లో మాత్రం ఈ కార్యక్రమాన్ని అస్సలు నిర్వహించలేదు. 2021, 2022 సంవత్సరాల్లో వర్చువల్‌గా జరిగింది. 2023 నుంచి తిరిగి పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు.

Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget