అన్వేషించండి

Samsung Galaxy A55 5G: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?

Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ మొబైల్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం కానుంది.

Samsung Galaxy A55 5G Price Revealed: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను కంపెనీ ఇంతకు ముందే రివీల్ చేసినప్పటికీ ధరను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ధర, సేల్ వివరాలను ప్రకటించింది. ఇందులో 6.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ ధర (Samsung Galaxy A55 5G Price in India)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.45,999గానూ నిర్ణయించారు.

అసమ్ ఐస్ బ్లూ, అసమ్ నేవీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, వన్ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ అందించనున్నారు. దీనికి సంబంధించి ఈఎంఐ ఆప్షన్లు రూ.1,792 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో దీని సేల్ మార్చి 18వ తేదీ నుంచి జరగనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ స్పెసిఫికేషన్లు (Samsung Galaxy A55 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. నాలుగు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను శాంసంగ్ అందించనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేయనుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీలో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ లభించనుంది.

4 ఎన్ఎం ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా డేటాకు ప్రొటెక్షన్ లభించనుంది. ఐపీ67 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ప్రధాన కెమెరాలో ఆటో ఫోకస్ ఫీచర్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget