Best Portable Air Conditioners: వేసవిలో కూలర్లు కాదు, పొర్టబుల్ ఏసీలను కొనండి - ధర కూడా తక్కువేనండోయ్!
ఎండాకాలం వచ్చిందంటే చాలా వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూలర్లు వాడుతారు. కానీ, ఇకపై పొర్టబుల్ ఎయిర్ కండీషనర్లు కొనుక్కోండి. ధర తక్కువ. కూల్ నెస్ చాలా ఎక్కువ.
Best Portable Air Conditioners: వేసవిలో ఎండను తట్టుకునేందుకు జనాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు కూలర్లు వాడితే మరికొందరు ఏసీలు వినియోగిస్తారు. అయితే, గత కొంతకాలంగా మార్కెట్లోకి పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరకు లభించడంతో పాటు ఎక్కువ కూలింగ్ అందించడం వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ పోర్టబుల్ కూలర్లు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఎక్కడైనా అమర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. కరెంటు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ సేపు కూలింగ్ ను అందిస్తాయి. తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీతో లభించే నాలుగు పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1) HOOMEE 560 CM పోర్టబుల్ ఎయిర్ కండీషనర్- రూ. 5,593
HOOMEE 560 CM యూనివర్సల్ విండో సీల్ అనేది లేటెస్ట్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్. దీనిని విండోకు అమర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఉన్న ఎయిర్ ఎక్స్ఛేంజ్ గార్డులు వేడి గాలిని గదిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. గదిలో తక్కువ సమయంలోనే చల్లదనాన్ని కలిగిస్తాయి. 560 సెం.మీ పొడవుతో ఈ పోర్టబుల్ ఏసీ విండోకు అతికినట్లుగా ఉంటుంది. దీని ధర కేవలం రూ. 5593. అమెజాన్ లో అందుబాటులో ఉంది.
2) రివేరా పర్సనల్ ఎయిర్ కూలర్ - ధర రూ.1,809
రివేరా పర్సనల్ ఎయిర్ కూలర్, పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ తక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు చక్కటి చల్లదనాన్ని అందిస్తుంది. మినీ ఎవపొరాటివ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీనిని డెస్క్‌లు, నైట్‌స్టాండ్‌లు, కాఫీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. 7 రంగుల LED లైట్ ను కలిగి ఉంటుంది. మినీ ఎవపొరాటివ్ కూలర్ ను కలిగి ఉంటుంది. 1/2/3 గంటల టైమర్ తో కూలింగ్ సదుపాయం ఉంటుంది. 3 విండ్ స్పీడ్ తో పాటు 3 స్ప్రే మోడ్‌లు లను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1809 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది.
3) ఎవాపోలార్ ఎవాచిల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్- ధర రూ.15,897
ఎవాపోలార్ ఎవాచిల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ను EV-500 అని కూడా పిలుస్తారు. ఇది చక్కటి చల్లదనాన్ని అందిస్తుంది. బెడ్ రూమ్, ఆఫీస్, కార్లు, క్యాంపింగ్ ట్రిప్పులలో దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని కాంపాక్ట్ డిజైన్, అర్బన్ గ్రే కలర్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 15,897గా కంపెనీ నిర్ణయించింది. కావాలి అనుకునే వాళ్లు అమెజాన్ లో కొనుక్కోవచ్చు.
4) బజాజ్ స్నోవెంట్ టవర్ ఫ్యాన్- ధర రూ. 4,288
బజాజ్ స్నోవెంట్ టవర్ ఫ్యాన్ ఇంటికి ఈజీగా చల్లబరుస్తుంది. ఈ పోర్టబుల్ టవర్ AC మూడు స్పీడ్ ఎయిర్ కంట్రోలర్స్ ను కలిగి ఉంటుంది. హై ఎయిర్ త్రో, స్వింగ్ కంట్రోల్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇది గది అంతటా చక్కటి శీతలీకరణను అందిస్తుంది. కూల్ గ్రే కలర్ లో లభిస్తుంది. బజాజ్ ఈ ఏసీ టవర్‌కు ఏడాది వారంటీ కూడా అందిస్తుంది. దీని ధర రూ.4,288.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు