Oneplus Nord Watch: రూ.ఐదు వేలలోపే వన్‌ప్లస్ వాచ్ - ఏకంగా 105 స్పోర్ట్స్ మోడ్స్ కూడా!
వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.4,999గా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి నార్డ్ వాచ్ ఇదే. ఇందులో 1.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. 105 స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హార్ట్ రేట్, స్ట్రెస్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ ఫీచర్లను ఇందులో అందించారు. 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని సమాచారం.
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ధర
దీని ధరను మనదేశంలో రూ.4,999గా నిర్ణయించారు. డీప్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఆథరైజ్డ్ వన్‌ప్లస్ పార్ట్‌నర్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో కూడా ఈవాచ్ అందుబాటులో ఉండనుంది. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్ లభించనుంది.
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 1.78 అంగుళాల హెచ్‌డీ అమోఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. పవర్ బటన్‌ను వాచ్ కుడివైపు అందించారు. ఆర్టీఓఎస్ ఆపరేటింగ్ సిస్టం, SF32LB555V4O6 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పనిచేయనుంది.
ఇన్ బిల్ట్ జీపీఎస్ సపోర్ట్‌తో ఈ వాచ్ లాంచ్ అయింది. హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకింగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. 105 స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది. నాన్ లీనియర్ వైబ్రేటర్ మోటర్ కూడా ఈ వాచ్‌లో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 230 ఎంఏహెచ్ కాగా, మ్యాగ్నటిక్ చార్జింగ్ కేబుల్‌ను కూడా దీని ద్వారా పొందవచ్చు. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది. జింక్ అలోయ్, ప్లాస్టిక్‌తో దీని ఫ్రేమ్‌ను రూపొందించారు. సిలికాన్ స్ట్రాప్స్‌ను దీంతో అందించనున్నారు. దీని బరువు 52.4 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram