News
News
X

Nokia T10: నోకియా టీ10 ధర లీక్ - రూ.12 వేలలోపే బడ్జెట్ ట్యాబ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలో లాంచ్ చేయనున్న టీ10 బడ్జెట్ ట్యాబ్లెట్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది.

FOLLOW US: 

మనదేశంలో నోకియా టీ10 ట్యాబ్లెట్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ ట్యాబ్లెట్ జులైలో గ్లోబల్‌గా లాంచ్ అయింది. ఇది ఒక చిన్న ట్యాబ్లెట్. కాంపాక్ట్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. వైఫై, వైఫై + 4జీ ఎల్టీఈ మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్‌కు మూడు నెలలకు ఒకసారి నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్‌గా ఉంది.

నోకియా టీ10 ధర (అంచనా)
తాజాగా వస్తున్న లీకుల ప్రకారం... నోకియా టీ10 ధర రూ.11,999గా ఉండనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్స్ పేజీలో ఈ ట్యాబ్లెట్ కూడా లిస్ట్ అయింది. అయితే ఇది పొరపాటున లీక్ అయిందని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్యాబ్ ఇంతవరకు లాంచ్ కాలేదు.

నోకియా టీ10 స్పెసిఫికేషన్లు
ఇందులో 8 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను నోకియా అందించింది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 800 x 1280 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:10గానూ ఉంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ నోకియా టీ10లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు ఉన్న 2 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాల ద్వారా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5250 ఎంఏహెచ్ కాగా, 10W చార్జర్‌ను బాక్స్‌తో అందించనున్నారు.

బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియోజాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టువంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 375 గ్రాములుగా ఉంది. ఓజో ప్లేబ్యాక్ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by N Gaadhe (@mobiles_zone9)

Published at : 22 Sep 2022 05:28 PM (IST) Tags: Nokia Nokia T10 Nokia T10 Features Nokia T10 Price Leak Nokia T10 Launched Nokia New Tab

సంబంధిత కథనాలు

Honor Tab 8 Launched: బడ్జెట్ ధరలో హానర్ కొత్త ట్యాబ్ - మనదేశంలో ఎంట్రీ!

Honor Tab 8 Launched: బడ్జెట్ ధరలో హానర్ కొత్త ట్యాబ్ - మనదేశంలో ఎంట్రీ!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Whatsapp Call Links : వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Whatsapp Call Links :  వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?