News
News
X

Lenovo New Tab: లెనోవో కొత్త ట్యాబ్ వచ్చేసింది - 11 అంగుళాల డిస్‌ప్లేతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో మనదేశంలో సెకండ్ జెన్ ట్యాబ్ పీ11 ప్రోను లాంచ్ చేసింది.

FOLLOW US: 
 
లెనోవో మనదేశంలో సెకండ్ జెన్ ట్యాబ్ పీ11 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. 2020లో లాంచ్ అయిన ట్యాబ్ పీ11 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ రెండో తరం ట్యాబ్లెట్ దిగింది. 11.5 అంగుళాల డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే కూడా ఈ ట్యాబ్‌లో ఉంది. శాంసంగ్, యాపిల్‌లో మిడ్ రేంజ్ ట్యాబ్లెట్లతో లెనోవో కొత్త ట్యాబ్ పోటీ పడనుంది.

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 ధర
దీని ధరను మనదేశంలో రూ.39,999గా నిర్ణయించారు. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. లెనోవో.కాం, అమెజాన్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో అక్టోబర్ 17వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. త్వరలో ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో కూడా ఇది అందుబాటులోకి రానుంది.

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డ్యూయల్ టోన్ డిజైన్ తరహాలో గ్లాస్ తరహా ఫినిష్‌ను ఇందులో అందించారు. 11.2 అంగుళాల సినిమాటిక్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ట్యాబ్‌లో ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2560 x 1536 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 15:9గా ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్10+ ఫీచర్లను ఎన్‌హేన్స్‌డ్ వీడియో క్వాలిటీ కోసం అందించారు.

ఆక్టాకోర్ మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే స్టైలస్ పెన్ కూడా ఇందులో ఉండనుంది. ఆన్ స్క్రీన్ డాక్యుమెంట్స్, మ్యూజిక్, ఇమేజెస్, రికార్డింగ్స్‌ను ఇందులో అందించనున్నారు. 

News Reels

ఆడియో విషయానికి వస్తే... లెనోవో ట్యాబ్ పీ11 ప్రోలో నాలుగు స్పీకర్ల జేబీఎల్ స్పీకర్ సిస్టంను అందించారు. డాల్బీ అట్మాస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8000 ఎంఏహెచ్ కాగా, 14 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ (మూడో తరం) మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999 కాగా, ఎల్టీఈ వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించారు. దీని బరువు 465 గ్రాములుగా ఉంది. 10.61 అంగుళాల 2కే ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ ట్యాబ్‌లో అందించారు. దీని ముందువైపు, వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. 7700 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మనదేశంలో గూగుల్ కిడ్స్ స్పేస్ ఉన్న మొదటి ట్యాబ్లెట్లలో ఒకటిగా లెనోవో దీని గురించి చెబుతోంది. కంటెంట్ ఫిల్టర్స్, సేఫ్టీ కంట్రోల్స్, పిల్లల కోసం ప్రైవసీ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఇది రానుంది. ఈ డెడికేటెడ్ మోడ్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన యాప్స్, బుక్స్, వీడియోలు ఉండనున్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లుగా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఈ ట్యాబ్‌లో అందించారు. డాల్బీ అట్మాస్ టెక్నాలజీని లెనోవో కొత్త  ట్యాబ్లెట్ సపోర్ట్ చేయనుంది. 

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Published at : 14 Oct 2022 05:13 PM (IST) Tags: Lenovo New Tab Lenovo second-gen Tab P11 Pro Price in India Lenovo second-gen Tab P11 Pro Lenovo second-gen Tab P11 Pro Launched Lenovo second-gen Tab P11 Pro Specifications Lenovo second-gen Tab P11 Pro Features

సంబంధిత కథనాలు

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?