మంచి స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ అమేజ్‌ఫిట్ డివైస్‌ను మర్చిపోకండి!
అమేజ్‌ఫిట్ కంపెనీ తన జీటీఆర్ 4 స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.
అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4 స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 1.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్, 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4 ధర
దీని ధరను మనదేశంలో రూ.16,999గా నిర్ణయించారు. అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద రూ.15,299కే కొనుగోలు చేయవచ్చు. సూపర్ స్పీడ్ బ్లాక్, రేస్‌ట్రాక్ గ్రే రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. అమేజ్ ఫిట్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీని సేల్ జరుగుతోంది.
అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ వాచ్‌లో 1.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే కూడా ఈ వాచ్‌లో ఉంది. 24 గంటల పాటు హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 సెన్సార్, స్ట్రెస్ ట్రాకర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. స్లీప్ ప్యాటర్న్‌లను మానిటర్ చేయడంతో పాటు బ్రీత్ క్వాలిటీపై కూడా ఇది ఒక కన్నేసి ఉంచుతుంది.
అమేజ్‌ఫిట్ జెప్ ఓఎస్‌పై ఈ వాచ్ పని చేయనుంది. 150 స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందించారు. ఎనిమిది రకాల వర్కవుట్లను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ వర్కవుట్ డిటెక్షన్ కూడా ఈ వాచ్‌లో ఉంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్‌గా అలెక్సా పని చేయనుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఈ వాచ్‌లో ఉండటం విశేషం. ఒక్కసారి చార్జింగ్ పెడితే 14 రోజుల పాటు దీన్ని ఉపయోగించవచ్చు.
ఇక స్మార్ట్ వాచ్‌ల విషయానికి వస్తే... హానర్ వాచ్ జీఎస్ 3 స్మార్ట్ వాచ్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఓషన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, క్లాసిక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 1.43 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 466×466 పిక్సెల్స్‌గా ఉంది. అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించడం విశేషం. 316ఎస్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, 3డీ కర్వ్‌డ్ గ్లాస్‌తో దీన్ని రూపొందించారు. ఈ వాచ్‌లో 1000కి పైగా డిజైన్లు ఉన్న వాచ్ ఫేసెస్ ఉండటం విశేషం. అపోలో 4 చిప్‌సెట్‌ను కంపెనీ ఇందులో అందించింది. 100 వర్కవుట్ మోడ్స్ ఈ వాచ్‌లో ఉన్నాయి. 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందించారు.
లైట్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ వాచ్ పనిచేయనుంది. బిల్ట్ ఇన్ జీపీఎల్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ పొజిషనింగ్ అందించారు. హార్ట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్‌లు కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 451 ఎంఏహెచ్‌గా ఉంది. 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది. జీపీఎస్ మోడ్‌లో ఉండే 30 గంటల పాటు పనిచేయనుంది. ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే ఒక రోజు ఉపయోగించవచ్చు. బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు కేవలం 44 గ్రాములు మాత్రమే.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?