Text to video feature: త్వరలో ఎక్స్‌లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్స్‌కు పండగే.. Elon Musk ప్రకటన
GROK AI | ఎలాన్ మస్క్ ఎక్స్ సంస్థ రూపొందించిన Grok AI అక్టోబర్ 2025 నుండి కొత్త ఫీచర్ అయిన టెక్స్ట్-టు-వీడియో ఫీచర్ లాంచ్ చేస్తోంది.

Grok AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ ఎక్స్ AI ద్వారా తయారు చేసిన AI చాట్‌బాట్ Grokను నెటిజన్లు బాగానే వాడేస్తున్నారు. అక్టోబర్ 2025లో ఎక్స ఓ పవర్‌ఫుల్, విప్లవాత్మక ఫీచర్ ప్రారంభించనుంది. ఆ ఫీచరే టెక్స్ట్-టు-వీడియో జనరేషన్. టెక్స్ మీరు అందిస్తే అది వీడియో రూపంలో మీకు తిరిగిస్తుంది. ఈ కొత్త ఫీచర్ గురించి స్వయంగా Elon Musk వెల్లడించారు. ఆయన ఒక పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “ఇప్పుడు మీరు త్వరలో Grok లో వీడియోలను తయారు చేయడం సాధ్యం. @Grokapp డౌన్‌లోడ్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి” అని పోస్ట్ చేశారు.
You’ll soon be able to generate videos on Grok. Download the standalone @Grok app and subscribe. pic.twitter.com/9ZJMY3W5Tw
— DogeDesigner (@cb_doge) July 29, 2025
Imagine, Aurora మేషిన్‌తో వీడియో తయారీ
Grok తన అధికారిక X (గతంలో Twitter) ప్రొఫైల్‌లో ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలిపింది. త్వరలో రానున్న ఈ వీడియో జనరేషన్ ఫీచర్ Imagine అనే టూల్ ద్వారా పనిచేస్తుంది. దీనిని Grok కు చెందిన Aurora ఇంజిన్ చేస్తుంది. ఈ టెక్నాలజీ సహాయంతో, వినియోగదారులు కేవలం టెక్ట్స్ మెస్సేజ్ లాంటిది రాయడం ద్వారా, అందులో వాయిస్ జత చేస్తే ఒక వీడియోను తయారు అవుతుంది. అది కూడా ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేకుండా మీకు వీడియో తయారవుతుంది.
మొదట Super Grok వినియోగదారులకు మాత్రమే
అయితే టెక్ట్స్ టు వీడియో క్రియేట్ ఫీచర్ మొదటగా Super Grok సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక ప్రీమియం ప్లాన్, దీని ధర నెలకు 30 డాలర్లు. Super Grok వినియోగదారులకు అక్టోబర్ నుంచి ఈ టెక్ట్స్ టు వీడియో ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. మిగిలిన వినియోగదారులకు దశలవారీగా దీన్ని అందుబాటులోకి తెస్తామని ఎక్స్ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు Grok యాప్ ద్వారా వెయిట్‌లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే అందుబాటులో చాలా ఫీచర్లు
Grok యాప్‌లో ఇప్పటికే ఇమేజ్ క్రియేషన్, వాయిస్ చాట్, కన్వర్‌జేషన్ AI చాట్‌బాట్ వంటి పలు AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టెక్ట్స్ టు వీడియో ఫీచర్ చేరడంతో, ఈ ప్లాట్‌ఫారమ్ కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ మార్కెట్ టీమ్‌లకు మేలు చేసే టూల్ కానుంది.
Grok AI సూపర్ యాప్
Grok కేవలం ఒక చాట్‌బాట్ మాత్రమే కాదు.. X సంస్థకు చెందిన Premium+ సబ్‌స్క్రిప్షన్ లోకి వస్తుంది. ఇందులో వినియోగదారులకు DeepSearch, రియల్ టైమ్ డేటా యాక్సెస్‌తో పాటు హై-క్వాలిటీ ఇమేజ్ జనరేషన్ వంటి మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి. ఇప్పుడు టెక్ట్స్ టు వీడియో ఫీచర్ చేరడంతో, Grok AI ఒక ఆల్-ఇన్-వన్ మీడియా క్రియేషన్ ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది. ఈ కొత్త ఫీచర్ కంటెంట్ మీద ఆధారపడిన వారికి అవకాశాలు కల్పిస్తోంది.






















