Defy Space: రూ.1,699కే స్మార్ట్ వాచ్... అదిరిపోయే ఫీచర్లు!
డిఫై మనదేశంలో తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. అదే డిఫై స్పేస్.
భారతదేశ ఆడియో బ్రాండ్ డిఫై తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే డిఫై స్పేస్. డిఫై వైర్డ్, వైర్‌లెస్ ఆడియో ఉత్పత్తులను ఇప్పటివరకు లాంచ్ చేసింది. స్మార్ట్ వాచ్‌ల విభాగంలోకి రావడం ఇదే మొదటిసారి.
డిఫై స్పేస్ స్మార్ట్ వాచ్ ధర
ప్రారంభ ఆఫర్ కింద ఈ వాచ్‌ను రూ.1,699కే విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌పై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.
డిఫై స్పేస్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు
ఇందులో 1.69 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. 24 గంటల హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంది. ఇది ఎస్పీఓ2 మానిటర్‌కు పెయిర్ అయి ఉంటుంది. ఈ వాచ్ యాప్‌కు డేటాను సింక్ చేస్తుంది. ఇందులో చాలా వాచ్ ఫేసెస్‌ను కూడా కంపెనీ అందించింది. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
మొబైల్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కోసం వినియోగదారులు ఈ వాచ్ ద్వారానే మ్యూజిక్‌ను ప్లే, పాజ్, స్టాప్ చేయవచ్చు. అలాగే ట్రాక్స్ మార్చుకోవచ్చు కూడా. ఇందులో ఉన్న కెమెరా కంట్రోల్ ద్వారా ఒక్క ట్యాప్‌తో దేన్నయినా క్యాప్చర్ చేయవచ్చు.
టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్స్, కాల్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఈ వాచ్ ద్వారా అందుకోవచ్చు. దీంతోపాటు సెకండరీ అలెర్ట్స్ కూడా వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా అందించారు. ఇది మీ నోటిఫికేషన్లను ఆపేసి మీరు కావాలనుకున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాయి.
రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్, క్లైంబింగ్, స్కిప్పింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీస్‌ను ఇది ట్రాక్ చేయనుంది. బ్లాక్, బ్లూ, స్కిన్ సేఫ్ సిలికాన్ స్ట్రాప్స్ వేరియంట్లలో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!