Blaupunkt Cybersound: 40 అంగుళాల పెద్ద స్మార్ట్ టీవీ రూ.15 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూసేయండి!
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ బ్లాపంక్ట్ మనదేశంలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది.
Blaupunkt: జర్మన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ బ్లాపంక్ట్ మనదేశంలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. అవే బ్లాపంక్ట్ సైబర్ సౌండ్ టీవీలు. ఇందులో 40 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
బ్లాపంక్ట్ సైబర్ సౌండ్ స్మార్ట్ టీవీల ధర
ఇందులో 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 43 అంగుళాల వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద వీటిని ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభించనుంది. అంటే 40 అంగుళాల టీవీని రూ.15 వేలలోపు ధరకే కొనేయచ్చన్న మాట.
బ్లాపంక్ట్ సైబర్ సౌండ్ స్మార్ట్ టీవీల స్పెసిఫికేషన్లు
ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. 40 అంగుళాల స్క్రీన్ ఉన్న మోడల్‌లో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 400 నిట్స్‌గా ఉంది. దీని అంచులు సన్నగా ఉన్నాయి. ఇక 43 అంగుళాల మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెట్ 500 నిట్స్‌గా ఉంది. ఇందులో అంచులు లేని డిజైన్‌ను అందించారు. ఇందులో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గూగుల్ ప్లేస్టోర్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులను ఇది సపోర్ట్ చేయనుంది.
బ్లాపంక్ట్ తెలిపిన దాని ప్రకారం... వీటిలో 40W స్పీకర్లు ఉండనున్నాయి. సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా వీటిలో అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, యాపిల్ ఎయిర్‌ప్లే, మూడు హెచ్‌డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఇందులో ఉండనున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
View this post on Instagram