అన్వేషించండి

Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎక్కువగా అమెరికాకు మాత్రమే పరిమితమైన బ్లాక్ ఫ్రైడే సేల్ ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రజాదరణ పొందింది. ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Samsung ఈ సంవత్సరం Galaxy Z Fold 4, Galaxy Z Flip 4లను లాంచ్ చేసింది. ఇవి బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండనున్నాయి.

రిటైల్ చైన్ మేజర్ క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో Apple MacBook, iPhone మోడళ్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. పేమెంట్ సమయంలో రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో Apple Macbook Air 2022ని రూ.1,05,090కే కొనుగోలు చేయవచ్చు. Apple iPhone 13 128 జీబీ మోడల్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ధరను రూ.4,000 వరకు తగ్గించనున్నారు.

నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ జరగనుంది. ఇందులో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung తన ఫ్లాగ్‌షిప్‌లు, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ సిరీస్ S22 రూ.60,000 లోపు అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్22 ప్రస్తుతం రూ.67,999 ధరకు అందుబాటులో ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో Galaxy S22 Ultra, Galaxy S22+ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

శాంసంగ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక టీజర్‌ను పోస్ట్ చేసి, బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. Samsung Galaxy Z Flip 4 ధర ప్రస్తుతం రూ. 89,999గా ఉంది. ఇది అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 80,999 ధరకే అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy Z Flip 3 ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే సేల్‌లో అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.60,000 లోపు ధరకే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. Samsung Galaxy Z Fold 4 కూడా రూ. 10,000 తగ్గింపును అందించనున్నారు. ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samsung India (@samsungindia)

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget