(Source: Poll of Polls)
Best Fridges under 10000: రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? - ఈ ఆప్షన్లు మీకోసమే!
Best Offers on Fridges: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ప్రస్తుతం ఆఫర్ సేల్స్ జరుగుతున్నాయి. రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కొనాలనుకునే వారికి కొన్ని మంచి ఆప్షన్లు ఈ సేల్స్‌లో లభిస్తాయి.
Top Fridge under 10000: ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం షాపింగ్ కంపెనీలు దసరా నవరాత్రులు, దీపావళి సందర్భంగా ఆఫర్ సేల్స్‌ను నిర్వహిస్తాయి. ఈ దీపావళి సేల్ సందర్భంగా మీరు రూ. 10,000లోపు మంచి ఫ్రిజ్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ ఐదు ఆప్షన్లపై ఒక లుక్కేయండి.
ఎల్జీ 45 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (LG 45L Direct Cool Single Door Mini Refrigerator)
ఎల్జీ నుంచి వచ్చిన ఈ మినీ ఫ్రిజ్ చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్‌కు మంచి ఆప్షన్. ఇది 45 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. అలాగే స్టైలిష్ డిజైన్‌లో వస్తుంది. దీని డైరెక్ట్ కూలింగ్ సిస్టమ్ ఫ్రిజ్‌ని త్వరగా చల్లబరుస్తుంది. విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర రూ. 8,999గా ఉంది.
హైయర్ 52 లీటర్ 3 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (Haier 52L 3 Star Direct Cool Single Door Mini Refrigerator)
హైయర్ లాంచ్ చేసిన ఈ మినీ ఫ్రిజ్ కాంపాక్ట్, ఎనర్జీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇది 52 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. దీని వలన విద్యుత్ ఆదా అవుతుంది. ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించే ఇన్‌బిల్ట్ స్టెబిలైజర్‌ను కలిగి ఉంది. అమెజాన్ సేల్‌లో దీని ధర రూ.9,499గా ఉంది.
మితాషి 87 లీటర్ 2 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ (Mitashi 87L 2 Star Direct Cool Single Door Refrigerator)
మితాషి తీసుకువచ్చిన ఈ ఫ్రిజ్ కొంచెం పెద్దది. 87 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుంది. ఇది 2 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ లాక్, యాంటీ ఫంగల్ డోర్ గాస్కెట్‌ని కూడా కలిగి ఉంది. ఇది ఫ్రిజ్‌ను శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర రూ.9,999గా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
వర్ల్‌పూల్ 46 లీటర్ 2 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (Whirlpool 46L 2 Star Direct Cool Single Door Mini Refrigerator)
వర్ల్‌పూల్ నుంచి వచ్చిన ఈ మినీ ఫ్రిజ్ 46 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని 2 స్టార్ రేటింగ్, డైరెక్ట్ కూలింగ్ సిస్టమ్ దీనిని మంచి ఆప్షన్‌గా చేస్తాయి. ఇది అడ్జస్టబుల్ రాక్‌లు, రిమూవబుల్ గాస్కెట్‌ను కలిగి ఉంది. ఇది శుభ్రపరచడాన్ని మరింత సులభం చేస్తుంది. అమెజాన్ సేల్‌లో దీని ధర రూ.9,799గా ఉంది.
కోర్యో 45 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (Koryo 45L Direct Cool Single Door Mini Refrigerator)
కోర్యో తీసుకువచ్చిన ఈ మినీ ఫ్రిజ్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది 45 లీటర్ల కెపాసిటీ, కాంపాక్ట్ డిజైన్‌లో వస్తుంది. దీని డైరెక్ట్ కూలింగ్ సిస్టమ్, ఎనర్జీ ఎఫెక్టివ్ డిజైన్ దీని ధర తక్కువ అయ్యేలా చేస్తాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర రూ. 8,799గా నిర్ణయించారు.
ఈ ఫ్రిజ్‌లు తీసుకుంటే మీ బడ్జెట్‌లో అత్యుత్తమ ఫ్రిజ్‌ను పొందవచ్చు. ఈ ఫ్రిజ్‌లన్నీ కాంపాక్ట్, ఎనర్జీ ఎఫెక్టివ్, తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. ఇవి చిన్న కుటుంబాలు, బ్యాచిలర్‌లకు మంచి ఆప్షన్లు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌లో ఈ ఫ్రిజ్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు మీకు డబ్బును మరింత ఆదా చేయడంలో సహాయపడతాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?