Asus Laptop: కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అసుస్ లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌పై లుక్కేయండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త ల్యాప్‌టాప్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.
అసుస్ మనదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. అదే అసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ బీ1400. ఇందులో 11వ తరం ఇంటెల్ కోర్ టైగర్ లేక్ ప్రాసెసర్లను అందించారు. ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్ఈడీ డిస్‌ప్లేలు, ఎంఐఎల్-ఎస్టీడీ810హెచ్ సర్టిఫైడ్ బిల్డ్‌ను ఇందులో అందించారు.
అసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ బీ1400 ల్యాప్‌టాప్ ధర
ఈ ల్యాప్‌టాప్‌ల ధర మనదేశంలో రూ.48,990 నుంచి ప్రారంభం కానుంది. దీనికి జీఎస్టీ అదనం. త్వరలో ఇవి అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో, పీసీ చానెల్ పార్ట్‌నర్ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నాయి. బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
అసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ బీ1400 ల్యాప్‌టాప్ ఫీచర్లు
ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గానూ ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 84 శాతంగానూ ఉంది. 178 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, యాంటీ గ్లేర్ కోటింగ్‌ను ఇందులో అందించారు.
ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఇవన్నీ 11వ తరం ప్రాసెసర్లే. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ లేదా ఎన్‌వీడియా జీఫోర్స్ ఎంఎక్స్330 జీపీయూ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఎక్కువ లోడ్ ఉన్న వర్క్ చేసినా.. హీట్ అవ్వకుండా డ్యూయల్ హీట్ పైప్ కూలింగ్ సొల్యూషన్ అందించారు.
16 జీబీ వరకు డీడీఆర్4 ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. 1 టీబీ ఎస్ఎస్‌డీ లేదా 2 టీబీ హెచ్‌డీడీ స్టోరేజ్ వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి. విండోస్ 10 హోం లేదా ప్రో ఆపరేటింగ్ సిస్టంలపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇక ఈ ల్యాప్‌టాప్ 10 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది.
వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-సీ పోర్టు, రెండు యూఎస్‌బీ 3.2 జెన్ 2 టైప్-ఏ పోర్టు, ఒక యూఎస్‌బీ 2.0 పోర్టు, మైక్రో ఎస్‌డీ కార్డు రీడర్, హెచ్‌డీఎంఐ పోర్టు, వీజీఏ పోర్టు, గిగాబిట్ ల్యాన్ పోర్టు, కెన్సింగ్టన్ లాక్ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 1.92 సెంటీమీటర్లు కాగా, బరువు 1.45 కేజీల వరకు ఉంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?