అన్వేషించండి

iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించే పనిలోపడింది. ఇప్పటికే Samsung, Huawei, Oppoతో సహా అనేక స్మార్ట్‌ ఫోన్ తయారీ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టాయి. ప్రస్తుతం ఆపిల్ కూడా తన పోల్డబుల్ ఫోన్ ను 2025లో లాంచ్  చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు ‘ఐఫోన్ ఫోల్డ్’ అని పేరు పెట్టబోతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) విశ్లేషకుడు రాస్ యంగ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. Apple తన ఫోల్డబుల్ ఐఫోన్ 2025లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.  

ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతోందంటే?

ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. USB-C పోర్టును కలిగి ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు, మాగ్ సేఫ్ ఫీచర్ ఈ ఐఫోన్ లో ఫోల్డ్ సపోర్టు చేసే అవకాశం ఉంది. టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ను పోలిన డిజైన్ ఉండబోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ కు క్లామ్ షెల్ డిజైన్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ కోసం LGతో పనిచేస్తున్న యాపిల్

ఇక Apple ఫోల్డబుల్ ఫోన్ లో ఉపయోగించే  అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ను రూపొందించడానికి LGతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, Apple iPhone, iPad కోసం స్వంత కస్టమ్ చిప్‌లను డిజైన్ చేస్తోంది. అయినప్పటికీ, ఇది 5G కనెక్టివిటీకి సపోర్టు చేయడానికి అనుమతించే మోడెమ్‌ల కోసం చిప్‌ మేకర్ క్వాల్‌ కామ్‌పై ఆధారపడుతోంది.

ఫోల్డబుల్ మ్యాక్‌ బుక్స్‌ పైనా ఫోకస్

మరోవైపు  Apple ప్రస్తుతం 20-అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే గురించి సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. దీన్నిబట్టి యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ మ్యాక్‌ బుక్స్‌ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యా క్‌బుక్ మోడల్‌లు 2026 లేదంటే 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత నివేదికల ప్రకారం, 8-అంగుళాలు ఉండే అవకాశం ఉంది. మెయిన్ స్క్రీన్ Samsung డిస్‌ప్లేతో కూడిన WQD + ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో రావచ్చని తెలుస్తోంది. కుపెర్టినో టెక్ మేజర్ ఫోల్డబుల్ ఐఫోన్ స్క్రీన్ కోసం సిల్వర్ నానోవైర్ టచ్ సొల్యూషన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. తద్వారా Samsung Y-Octa డిస్‌ప్లేపై అంచుని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో మల్టిపుల్ ఫోల్డ్‌ లను కలిగి ఉండే ఫోల్డబుల్ డివైజ్‌లకు ఇది సహాయకరంగా ఉండబోతోంది. ఈ ‘ఐఫోన్ ఫోల్డ్’ ఫంకీ కలర్ ఆప్షన్‌లలో రావచ్చని తెలుస్తోంది. ఇది యంగ్ వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.  త్వరలోనే ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఇక నుంచి వాట్సాప్ పనిచేయదు!

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget