అన్వేషించండి

Apple: ఐఫోన్14, 14 Pro ధరలు భారత్ తో పోల్చితే ఈ 5 దేశాల్లో చాలా తక్కువ!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తాజాగా ఐఫోన్ 14 సిరీస్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా విడుదలైన నాలుగు ఫోన్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వీటి ధర భారత్ తో పోల్చితే కొన్ని దేశాల్లో తక్కువగా ఉంది.

Apple ఈ వారం మార్కెట్లో కొత్త iPhone 14 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ లో భాగంగా విడుదలైన iPhone 14, iPhone 14 Plus, 14 Pro, 14 Pro Maxని ప్రీ ఆర్డర్ చేసే అవకాశం ఉంది. యుఎస్, కెనడా, ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తో పాటు చైనా మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను తీసుకువచ్చింది. అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ధరలు  ఆయా దేశాల్లో చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. అక్కడ ఉండే పన్నులను బట్టి వీటి ధరలు మారుతూ వస్తున్నాయి. భారతదేశంలో iPhone 14  బేస్ మోడల్  ధర రూ.79,900 నుంచి మొదలవుతుంది.

భారత్ తో పోల్చితే అమెరికాలో రూ. 40 వేలు తక్కువ  

అమెరికాలో  Apple iPhone 14 ధర 128GB వేరియంట్  ధర  $799 (సుమారు రూ. 63,920) నుంచి ప్రారంభమవుతుంది. మీరు iPhone 14,  iPhone 14 Proని ఏ రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నారో దాని ఆధారంగా  8.5 శాతం నుంచి13 శాతం వరకు అదనపు పన్ను చెల్లించాలి.  న్యూయార్క్ లో, iPhone 14 128GB అన్‌లాక్ చేయబడిన మోడల్ కోసం మీకు $829 ఖర్చవుతుంది. మీరు మరో $74 (సుమారు రూ. 5,920)  రాష్ట్ర పన్నుగా ఇవ్వాలి.  ఇది iPhone 14 యొక్క తుది ధర  $903(సుమారు రూ. 72,240). ఇది భారతదేశంలో iPhone 14 128GB ధర కంటే దాదాపు రూ. 7,000 చౌకగా ఉంటుంది. అటు iPhone 14 Pro 128GB ధర $999 (సుమారు రూ. 79,920).  న్యూయార్క్ లో $87 (సుమారు రూ. 6,960) అదనపు పన్ను ఉంటుంది, ఇది చివరి చెక్ అవుట్ ధరను $1,088 (రూ. 87,040)కి తీసుకువస్తుంది, ఇది భారతీయులు బేస్ iPhone 14 ప్రో వేరియంట్ కోసం చెల్లించాల్సిన దాని కంటే దాదాపు 40,000 తక్కువ.  

కెనడాలో రూ. 30,000 వరకు తక్కువ

కెనడాలో Apple iPhone 14  128GB వేరియంట్  ధర  CND $ 1,099 (సుమారు రూ. 68,138) నుంచి  ప్రారంభమవుతుంది. అంటారియో  రాష్ట్రంలో, iPhone 14 128GB  అన్‌లాక్ చేయబడిన మోడల్‌కు మీకు CND $1,099 ఖర్చవుతుంది. మరో CND $143 (సుమారు రూ. 8,866) అదనపు రాష్ట్ర పన్నుగా చెల్లించాలి. ఇది iPhone 14   తుది ధర CND $1,242 (సుమారు రూ. 77,004). ఇది భారతదేశంలో iPhone 14 128GB ధర కంటే దాదాపు రూ. 2,000 తక్కువ. iPhone 14 Pro 128GB ధర CND $1,399 (సుమారు రూ. 85,738).  అంటారియోకి సంబంధించి CND $182 (సుమారు రూ. 11,284) అదనపు పన్ను ఉంటుంది, ఇది CND $1,581 (రూ. 98,040)కి తుది చెక్ అవుట్ ధర. భారతీయులు బేస్ iPhone 14 Pro వేరియంట్ కోసం చెల్లించాల్సిన దాని కంటే దాదాపు 30,000 తక్కువ.   

ఆస్ట్రేలియాలో రూ. 33,000 వరకు తక్కువ

ఆస్ట్రేలియాలో iPhone 14 ధర 128GB వేరియంట్  ధర A$ 1,399 (సుమారు రూ. 76,945) నుంచి ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియాలోని వ్యక్తులు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఎలాంటి అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, చెక్ అవుట్ ధరలో ఇప్పటికే A$ 128 (సుమారు రూ. 7,040) GST ఉంది. అందువల్ల, ఐఫోన్ 14 తుది ధర A$ 1,399గా ఉంది. ఈ ధర  భారతదేశంలో iPhone 14 128GB ధర కంటే రూ. 3,000 తక్కువ. iPhone 14 Pro 128GB ధర A$ 1,749 (సుమారు రూ. 96,195). భారతదేశంలో  ధర కంటే రూ. 33,000 తక్కువ.

సింగపూర్లో రూ. 37,000 వరకు తక్కువ

సింగపూర్‌లో iPhone 14 ధర 128GB వేరియంట్ ధర  S$ 1,299 (సుమారు రూ. 72,744) నుంచి ప్రారంభమవుతుంది. సుమారు S$85 (సుమారు రూ. 4,760) GST ఉంటుంది.  iPhone 14 128GB మోడల్‌ను భారతదేశంలో iPhone 14 128GB ధర కంటే దాదాపు రూ. 7,000 చౌకగా దొరుకుతుంది.    iPhone 14 Pro 128GB ధర S$1,649 (సుమారు రూ. 92,344). సింగపూర్ ఐఫోన్ 14 ప్రో మోడల్ యొక్క తుది ధరకు S$108 (రూ. 6,048) GSTని చేర్చింది.   మీరు భారతదేశంలో iPhone 14 Pro ధర కంటే దాదాపు 37,000 చౌకగా iPhone 14 Pro 128GB మోడల్‌ను పొందవచ్చు. 

UAEలో రూ. 35,000 వరకు తక్కువ

UAEలో iPhone 14 128GB వేరియంట్ ధర AED 3,399 (సుమారు రూ. 74,778) నుంచి ప్రారంభమవుతుంది.   iPhone 14 తుది ధరలో VAT దాదాపు AED 190 (సుమారు రూ. 4,180) వరకు ఉంటుంది. iPhone 14 128GB మోడల్‌ను భారతదేశంలో కంటే దాదాపు రూ. 5,200 చౌకగా పొందవచ్చు.  iPhone 14 Pro 128GB ధర AED 4,299 (సుమారు రూ. 94,578). దాదాపు AED 242 (రూ. 5,324) VAT ఉంటుంది. భారతదేశంలో iPhone 14 Pro ధర కంటే దాదాపు 35,000 చౌకగా లభిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP DesamJr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Rathnam Movie Review - రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Best Horror Movies on OTT: వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
Embed widget