Apple Event 2022 Live: యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్
యాపిల్ 2022 ఫార్ అవుట్ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఈ కార్యక్రమంలో లాంచ్ కానున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎలా?
నేడు (సెప్టెంబర్ 7వ తేదీ) భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అయ్యే ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ చానెల్లో లైవ్ ద్వారా చూడవచ్చు. యాపిల్ టీవీ యాప్ ద్వారా కూడా ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
ఏ డివైస్‌లు లాంచ్ కానున్నాయి?
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు ఈ ఈవెంట్లో కచ్చితంగా లాంచ్ కానున్నాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ప్రో కూడా ఈ సిరీస్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో లేటెస్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ తీసుకురానుంది.
ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర ఇటీవలే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ కథనాల ప్రకారం... ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనదేశంలో దాదాపు రూ.75 వేల నుంచి రూ.80 వేల మధ్య నుంచి ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ట్రెండ్ ఫోర్స్ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం... ఐఫోన్ 14 ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000), ఐఫోన్ 14మ్యాక్స్ ధర 849 డాలర్ల (సుమారు రూ.68,000), ఐఫోన్ 14 ప్రో ధర 1,049 డాలర్ల (సుమారు రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,149 డాలర్ల (సుమారు రూ.91,000) నుంచి మొదలుకానుంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉండనుంది.
యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఐఫోన్ 14 మ్యాక్స్‌లో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
iPhone 14 Launch Event Live: ముగిసిన యాపిల్ ఈవెంట్
ఐఫోన్ 14 ప్రో సిరీస్ లాంచ్ అయ్యాక ఈ ఈవెంట్‌కు యాపిల్ శుభం కార్డు వేసింది.
iPhone 14 Launch Event Live: ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ధర ప్రకటించిన యాపిల్
ఐఫోన్ 14 ప్రో ధరను 999 డాలర్లుగానూ (సుమారు రూ.79,600), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,099 డాలర్లుగానూ (సుమారు రూ.87,600) ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఇక వీటి సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది.
iPhone 14 Launch Event Live: ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌ను లాంచ్ చేసిన యాపిల్
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను యాపిల్ లాంచ్ చేసింది. కొత్త డైనమిక్ ఐల్యాండ్ నాచ్ డిజైన్‌ను వీటిలో అందించారు. స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, పర్పుల్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
iPhone 14 Launch Event Live: ఐఫోన్ 14, 14 ప్లస్ ధర ఎంతంటే?
ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (సుమారు రూ.63,700) నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఐఫోన్ 14 ప్లస్ ధర 899 డాలర్లుగా (సుమారు రూ.71,600) నిర్ణయించారు.
iPhone 14 Launch Event Live: ఈ ఫోన్లకు సిమ్ కార్డులు ఉండవు
ఐఫోన్ 14 సిరీస్ అమెరికా మోడళ్లలో ఫిజికల్ సిమ్ ట్రేలు అందించలేదు. కేవలం ఈసిమ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతాల్లో ఐఫోన్‌ను ఉపయోగించగలం. అమెరికా, కెనడాల కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా అందించనున్నారు.