(Source: ECI/ABP News/ABP Majha)
Android Problems Solution: మీ ఫోన్‌లో కూడా ఈ సమస్యలున్నాయా? ఇదిగో ఇలా చేస్తే చాలు, కొత్త ఫోన్‌లా పనిచేస్తుంది
ఆండ్రాయిడ్ ఫోన్లలో కామన్ గా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేయలేకపోవడం, స్లో ఛార్జింగ్ సహా పలు ఇబ్బందులు కలుగుతాయి. ఆయా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం
మోబైల్ ఫోన్లలో ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగానే రన్ అవుతాయి. అయితే, రకరకాల కంపెనీలు, రకరాల ఫోన్లను తయారు చేసి, అందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం మూలంగా కొన్ని కామన్ సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ కామన్ గా వచ్చే ఆ సమస్యలు ఏమిటీ? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మళ్లీ కొత్త ఫోన్‌లా పనిచేయాలంటే ఏం చేయాలి?
నెమ్మదిగా ఛార్జింగ్ (Slow Charging)
ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ ఫోన్లు ఉన్నా, కొన్నిసార్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జ్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇలా స్లో ఛార్జింగ్ కావడానికి ప్రధానంగా కేబుల్ సమస్య అయి ఉంటుంది. మీరు సరైన ఛార్జింగ్ కేబుల్ లేదంటే ఛార్జర్‌ని ఉపయోగించడం లేదని భావిస్తే, వేరే ఛార్జర్ తో ఛార్జింగ్ చేయడం ఉత్తమం. నెమ్మదిగా ఛార్జింగ్ కావడానికి మరొక కారణం బ్యాక్‌గ్రౌండ్ యాప్స్. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఓపెన్ చేసి ఉంటే, అవి ఎక్కువ పవర్ ను తీసుకుని ఛార్జింగ్ స్లో అయ్యేలా చేస్తాయి. దీన్ని పరిష్కరించడానికి, మీరు ఎప్పటికప్పుడు ఓపెన్ చేసిన యాన్స్ ను క్లియర్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, ఛార్జింగ్ పోర్ట్ దెబ్బతినవచ్చు. అప్పుడు వెంటనే దాన్ని సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లి మార్పించడం మంచిది.
Google Play Store పని చేయకపోవడం
ఆండ్రాయిడ్ వినియోగదారులు తరుచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. ఒక్కోసారి, మీ ఫోన్‌లో ఏ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కొత్త యాప్‌ని డౌన్‌లోడ్ చేస్తుంటే మధ్యలోనే ఆగిపోతుంది. ఈ సమస్యన పరిష్కరించాలంటే.. ఫోన్ మెమరీ నుంచి ప్లే స్టోర్‌ని క్లియర్ చేయాలి. లేదంటే యాప్‌ని ఫోర్సడ్ స్టాప్ చేయాలి. అయిన సమస్య పరిష్కారం కాకపోతే, 'అన్‌ఇన్‌స్టాల్ అప్‌డేట్స్'ను సెలెక్ట్ చేయాలి. అయినా సమస్య సాల్వ్ కాకపోతే మీ ఫోన్ లోని స్టోరేజ్ ని పరిశీలించాయి. స్టోరేజ్ ప్లేస్ తక్కువగా ఉంటే సరిపడేలా ఫైల్స్ క్లియర్ చేయాలి.
Gesture Navigation పని చేయకపోవడం
Android 10 తో Google పూర్తి స్క్రీన్ Gesture Navigation ఉపయోగించే అవకాశాన్ని కల్పిస్తోంది. స్క్రీన్‌కు ఎడమ, కుడి వైపు నుంచి స్వైప్ చేయడం లేదా ఫోన్ దిగువ నుండి స్వైప్ చేయడం ద్వారా హోమ్ స్క్రీన్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో Gesture Navigation ఒక్కోసారి పనిచేయదు. కొన్నిరకాల థర్డ్-పార్టీ లాంచర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని ఎదుర్కోవడానికి సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్ పై నొక్కాలి. డిఫాల్ట్ యాప్స్ ఓపెన్ చేసి హోమ్ యాప్ ను ఎంచుకోవాలి. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన లాంచర్‌కు వెళ్లాలి.వెంటనే Gesture Navigation పని చేస్తుంది.
మొబైల్ డేటా, Wi-Fi పని చేయకపోవడం
చాలా తరచుగా Android వినియోగదారులు తమ మొబైల్ డేటా, Wi-Fi పని చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ వాడకంలో ఇబ్బందులు వస్తాయి. Wi-Fi పని చేయకుంటే, Wi-Fi సెట్టింగ్‌లకు వెళ్లండి. Wi-Fiని ఆఫ్ చేసి, దాన్ని మళ్లీ ఆన్ చేయండి. వెంటనే Android నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయగలదు. అయిన సమస్య సాల్వ్ కాకపోతే రూటర్‌ని రీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు తరచుగా మొబైల్ డేటాతో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. దీన్ని ఆఫ్ చేయడం, తిరిగి ఆన్ చేయడం కొన్నిసార్లు సక్సెస్ అవుతారు. లేదంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల పాటు వేచి ఉండి, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేయండి. అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది.
యాప్స్ తరచుగా క్రాష్ కావడం
నిర్దిష్ట యాప్ తరచుగా క్రాష్ అవుతుంటే, మీ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్ చేయబడిందో? లేదో? తెలుసుకోండి. Google Play Store పేజీకి వెళ్లి, దాని 'అబౌట్' విభాగంపై నొక్కి, దిగువకు స్క్రోల్ చేయడం ద్వారా యాప్ చివరిసారిగా అప్ డేట్ చేయబడిదో లేదో తెలుస్తుంది. అయినా, క్రాష్ అయితే యాప్ డేటా, కాష్‌ను క్లియర్ చేసి ప్రయత్నించాలి.
Read Also: మీ కాలర్ ID కనిపించకుండా కాల్ చేయాలనుంటున్నారా? జస్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలోకండి