అన్వేషించండి

Mobile Tips: మీ కాలర్ ID కనిపించకుండా కాల్ చేయాలనుంటున్నారా? జస్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలోకండి

ఈ రోజుల్లో ట్రూ కాలర్ లాంటి యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా, ఎవరు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అలా తెలియకుండా కాల్స్ చేసుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.

ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉన్న యాప్స్ ద్వారా తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే, ఎవరు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ, ప్రైవసీని మెయింటెయిన్ చేయాలి అనుకునే వ్యక్తులు కాలర్ ఐడీ తెలియకుండా ఉండాలని భావిస్తారు. అలాంటి వారు కేవలం మూడంటే మూడు స్టెప్స్ ద్వారా కాలర్ ఐడీని కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కాల్ చేయాలనుకుంటున్న నంబర్కు ముందు *67తో డయల్ చేయండి

మీరు కాల్ చేయాలనుకుంటున్న ఫోన్ నంబర్ కు ముందు *67కు డయల్ చేయడం ద్వారా మీ నంబర్‌ను బ్లాక్ చేయడం ఈజీ అవుతుంది. మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేసిన వారికి కూడా మీ కాలర్ ID కనిపించకుండా ఉండాలంటే, ముందుగా వారి నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ యాప్‌లో మాన్యువల్‌గా టైప్ చేసి దానికి ముందు *67 యాడ్ చేయాలి. ఉదాహరణకు, మీరు 555-555-5555కి కాల్ చేస్తున్నప్పుడు, మీ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటే, *67-555-555-5555కి డయల్ చేయాలి. మీరు ఎవరికైనా కాల్ చేయడానికి *67ని ఉపయోగించినప్పుడు ఎదుటి వారి ఫోన్ లో మీ కాలర్ ఐడీ కనిపించదు.  

2. ఫోన్లో కాలర్ ID సెట్టింగ్లను మార్చండి

మీ ఫోన్ లో సెట్టింగ్‌లను మార్చడం ద్వారా కూడా మీ కాలర్ ఐడీని కనిపించకుండా చేసుకోవచ్చు. Android, iOS ఫోన్లలోనూ మీ కాలర్ IDని కనిపించకుండా దాచుకునే అవకాశం ఉంది. సెట్టింగ్‌లను మార్చిన తర్వాత మీ నంబర్‌ను తాత్కాలికంగా కనిపించేలా చేయాలనుకుంటే, మీరు కాల్ చేయాలనుకుంటున్న నంబర్‌కు ముందు *82 డయల్ చేయండి. మీ కాలర్ IDని మళ్లీ చూపిస్తుంది. iPhoneలో మీ కాలర్ IDని బ్లాక్ చేయడానికి  ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఫోన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కింది స్ర్కోల్ చేయాలి. మై కాలర్ ఐడిని నొక్కాలి. మీ ఐడీని కనిపించకుండా చేసేందుకు టోగుల్ ఆఫ్ చేయాలి. మీ Android ఫోన్ లో డయలర్ యాప్‌ని బట్టి, ఈ ప్రక్రియ కాస్త డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. ముందు మీ ఫోన్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సప్లిమెంటరీ సర్వీసెస్‌కి క్రిందికి స్క్రోల్ చేయాలి. కాల్స్ > అదనపు సెట్టింగ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మై కాలర్ IDని నొక్కాలి. పాప్అప్ మెను నుంచి నంబర్‌ను హైడ్ చేసే ఆప్షన్ ను ఎంచుకోవాలి.   

3. సెల్ క్యారియర్తో నేరుగా మీ కాలర్ IDని బ్లాక్ చేయండి

మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లలో మీ నంబర్‌ను బ్లాక్ చేయడానికి లేదా మీ కాలర్ IDని దాచడానికి ఎంపికను గుర్తించలేకపోతే, మీరు నేరుగా మీ సెల్ క్యారియర్‌తోనే బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయడం మూలంగా అన్ని కాల్స్ కు మీ కాలర్ ఐడి కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ  నిర్దిష్ట కాల్ కోసం మీ ఫోన్ నంబర్‌ను చూపించాలనుకుంటే, మీరు నంబర్ ప్రారంభంలో *82ని జోడించాలి.

Read Also: శాటిలైట్ ఫోన్లు ఎలా పని చేస్తాయి? ఇండియాలో వాటిని ఉపయోగించవచ్చా?

AT&T, T-మొబైల్తో మీ కాలర్ IDని ఎలా బ్లాక్ చేయాలి?

AT&T, T-Mobile సాధారణంగా మీ ఫోన్ లోని సెట్టింగ్‌లను ఉపయోగించి కాలర్ IDని బ్లాక్ చేసుకోవచ్చు.  మీరు AT&T, T-Mobile కోసం కస్టమర్ సపోర్ట్ లైన్‌కు కాల్ చేయాలి. అలా చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్ నుండి 611కి డయల్ చేయండి. మీ కాలర్ IDని దాచాలనుకుంటున్నారని కస్టమర్ సర్వీస్ ఆపరేటర్‌కు వివరించండి. వారు మీ ఖాతాకు అవసరమైన మార్పులను సూచిస్తూ బ్లాక్ అవకాశం కల్పిస్తారు.   

Verizonతో మీ కాలర్ IDని ఎలా బ్లాక్ చేయాలి?

మీ iPhone,  Android సెట్టింగ్‌ల నుండి మీ కాలర్ IDని బ్లాక్ చేయడానికి Verizon మిమ్మల్ని అనుమతించనప్పటికీ,  మీరు Verizon వెబ్‌సైట్ లేదా My Verizon యాప్‌ని ఉపయోగించి ఈ వెసులుబాటును పొందే అవకాశం ఉంటుంది. Verizon వెబ్‌సైట్‌ను ఉపయోగించడానికి, బ్లాక్‌ల పేజీకి వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి, ఆపై సేవలను నిరోధించే ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే, యాడ్ బటన్‌ను నొక్కండి. అదనపు సేవల విభాగం కింద కాలర్ IDని కనుగొని, మీ నంబర్‌ని బ్లాక్ చేయడానికి ఆన్ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Embed widget