News
News
X

Amazon Prime Day Sale 2021: అమెజాన్ అదిరే ఆఫర్లు.. రెండు రోజులు మాత్రమే!

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక 'ప్రైమ్‌ డే సేల్‌' నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆ సంస్థ ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది.

FOLLOW US: 
Share:

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) వార్షిక 'ప్రైమ్‌ డే సేల్‌'లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి 'అడ్వాంటేజ్‌- జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌' పేరిట ప్రైమ్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

అమెజాన్ (Amazon) ప్రైమ్ డే సేల్​లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి.

  • ఐక్యూ జెడ్​3 5జీ ఫోన్​పై సుమారు రూ.1,500 కూపన్​ డిస్కౌంట్​ లభించనుంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డిస్కౌంట్​తో ఈ ఫోన్​ రూ.17,000లకు రానుంది.
  • షియోమీ ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్​ఫోను ఎక్సేంజ్​ ఆఫర్ రూ.3000 తగ్గింపుతో రూ. 20 వేల లోపు రానుంది.
  • వన్​ప్లస్​ నోర్డ్​ 2 5జీ ఫోన్​పై వేయి రూపాయిల అడిషినల్​ డిస్కౌంట్​ లభించనుంది. అంతేగాకుండా ప్రైమ్​డే నాడు ఈ ఫోన్​ సూమారుగా రూ. 30వేలకు రానుంది.
  • వన్​ప్లస్​ 9ఆర్​ 5జీ ఫోన్​పై వినియోగదారులకు కూపన్స్​పై నాలుగు వేల రూపాయిలు ఎక్సేంజ్​ ఆఫర్​ కింద మరో 5వేల రూపాయిలు తగ్గనున్నాయి.
  • వన్​ప్లస్​ నోర్డ్​ సీఈ 5జీ మొబైల్​ ఫోన్​పై హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డిస్కౌంట్​ కింద వేయి రూపాయిలు ఆఫర్​ లభించనుంది. అంతేకాకుండా జియో వినియోగదారులు సుమారు రూ. 6వేల వరకు లబ్ధిపొందనున్నారు.
  • రెడ్​మీ నోట్​ 10టీ 5జీ ఫోన్​ ప్రైమ్​డే నాడు రూ.13,999లకు లభించనుంది.
  • శాంసంగ్​ గెలాక్సీ ఎం42 5జీపై సుమారు రూ. 10వేల వరకూ కూపన్​ ఆఫర్స్​ పొందగలుగుతారు.

Redmi Note 10 Pro Max:

ఈ ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.19,999గా ఉంది. అయితే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభించనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల Full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5,020mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

ఇవేకాక ఇతర బ్రాండ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి.

కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సైతం అమెజాన్ (Amazon) ఆఫర్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు 'యూత్‌ ఆఫర్‌' కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ప్రైమ్‌కు సైన్‌ అప్‌ అయిన తర్వాత వయసును ధ్రువీకరించి వెంటనే 50శాతం క్యాష్‌బ్యాక్‌ పొందడం ద్వారా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకుకోవచ్చు.

Published at : 26 Jul 2021 01:14 PM (IST) Tags: amazon Amazon Prime amazon sale amazon offers amazon prime day amazon today

సంబంధిత కథనాలు

Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!

Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!

Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!

Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!

Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?

Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?

Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?

Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు