Amazon Prime: అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకుంటున్నారా... త్వరపడండి.. రేటు పెరుగుతోంది.. ఎంత కానుందంటే?
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సబ్‌స్క్రిప్షన్ ఫీజును పెంచడానికి సిద్దం అవుతోంది. దీని వార్షిక రుసుం రూ.999 నుంచి రూ.1,499కు పెరగనుంది.
అమెజాన్ తన సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచడానికి సిద్ధం అవుతోంది. ఒకేసారి 50 శాతం ఇది పెరగనుందని తెలుస్తోంది. అంటే వార్షిక సభ్యత్వ రుసుం రూ.999 నుంచి రూ.1,499కు పెరగనుందన్న మాట. దీంతోపాటు నెలవారీ, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ రుసుం కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వాన్ని రూ.999 నుంచి రూ.1,499కు, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను రూ.329 నుంచి రూ.459కు, నెలవారీ ప్లాన్‌ను రూ.129 నుంచి రూ.179కి పెంచనున్నట్లు అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అతి త్వరలో ఈ ధర పెరగనుందని, ఎప్పుడు పెరగనుందో కంపెనీ త్వరలో ప్రకటిస్తుందని వెల్లడించారు.
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ లాంచ్ అయి ఐదు సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి వినియోగదారులకు నిరంతరాయంగా సేవలు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. షాపింగ్, సేవింగ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ లాభాలు కూడా ఈ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా లభించనున్నాయి.
ప్రైమ్ వన్‌డే డెలివరీ ద్వారా ప్రతిరోజూ కోట్లలో వస్తువులు డెలివరీ చేస్తున్నామని, ప్రైమ్ వీడియో ద్వారా 10 భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అమెజాన్ ఒరిజినల్స్ ఎంజాయ్ చేయవచ్చు.
అమెజాన్ మ్యూజిక్ ద్వారా 7 కోట్ల పాటలను యాడ్లు లేకుండా వినవచ్చు. దీంతో పాటు ప్రైమ్ రీడింగ్ ద్వారా వేల పుస్తకాలను ఉచితంగా చదవవచ్చు. సేల్ ఈవెంట్లకు ప్రైమ్ వినియోగదారులకు ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. దీంతో పాటు ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన డీల్స్ కూడా ఉంటాయి.
మనదేశంలో ఓటీటీలకు గత రెండేళ్లలో డిమాండ్ బాగా పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, ఆహా... ఇలా అన్ని యాప్స్‌కు వినియోగదారులు బాగానే పెరిగారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో రీజనల్ సినిమాలతో వీటిలో ఒకడుగు ముందే ఉంది.
Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: మీ చిన్నారుల కోసం స్ట్రోలర్ చూస్తున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో అతి తక్కువ ధరకే..!
Also Read: రూ.1,000లోపు టాప్-5 బ్లూటూత్ స్పీకర్లు.. రూ.400లో కూడా!