Redmi 9A Amazon Offer: అమెజాన్‌లో రెడ్‌మీ 9ఏపై సూపర్ ఆఫర్.. రూ.7 వేలలోపే!
అమెజాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 9ఏ స్మార్ట్ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ను అందించారు. రూ.7 వేలలోపే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 9ఏపై మంచి ఆఫర్ అందించారు. దీనిపై అందించే డిస్కౌంట్లన్నీ కలిపితే రూ.7 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఎక్స్‌చేంజ్ కూడా యాడ్ చేస్తే.. దీన్ని ఇంకా తక్కువకే కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే అందిస్తుంది. దీంతోపాటు ఇతర ఆఫర్లు కూడా దీనిపై అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే.. మీకు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.7,999 కాగా, ఈ సేల్‌లో రూ.7,799కే అందుబాటులో ఉంది. దీన్ని యాక్సిస్ బ్యాంకు లేదా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం తగ్గింపు లభించనుంది. అంటే రూ.7,000కు ఈ ఫోన్ ధర తగ్గిపోనుంది. అలాగే అమెజాన్ పే యూపీఐ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.100 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే రూ.6,900కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట.
దీంతోపాటు ఈ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.7,350 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా దీనిపై అందించనున్నారు. ఒకవేళ మీ పాత ఫోన్‌కు మంచి ఎక్స్‌చేంజ్ వ్యాల్యూ ఉంటే మీ ఫోన్ ఆల్‌మోస్ట్ ఉచితంగా పొందవచ్చు.
రెడ్‌మీ 9ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి!
రెడ్‌మీ 9ఏ ఫీచర్లు
ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్‌లో ఈ కెమెరాను అమర్చారు. ఫోన్ అంచులు కూడా కాస్త మందంగానే ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో ఉండే ఎన్‌హేన్స్‌డ్ లైఫ్ స్పాన్ బ్యాటరీ టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ బ్యాటరీ మూడు సంవత్సరాల పాటు మన్నుతుందని చెబుతున్నారు.
4జీ ఎల్టీఈ, వైఫై బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్‌బీ పోర్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.