Amazon: ఆఫర్ల జాతర వచ్చేస్తుంది - గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించనున్న అమెజాన్!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మనదేశంలో సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీరు ఎస్‌బీఐ కార్డుల ద్వారా ఏమైనా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు మొదటి సారి ఈ కార్డుల ద్వారా మొదటిసారి ఏమైనా కొనుగోలు చేస్తే ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం, ఐకూ ఈ సేల్‌ను స్పాన్సర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ బ్రాండ్ ఫోన్లపై మరింత తగ్గింపు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
సేల్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి కొన్ని డీల్స్‌ను అమెజాన్ ముందుగానే ప్రకటించింది. మీరు ఈ డీల్స్‌ను అమెజాన్ వెబ్‌సైట్లో చూడవచ్చు. ప్రైమ్ సభ్యులకు కొంచెం ముందుగానే ఈ సేల్ ప్రారంభం కానుంది. కాబట్టి వారికి డీల్స్‌కు ఎర్లీ యాక్సెస్ లభించనుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఐకూ స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు.
రెడ్‌మీ ప్రైమ్ 11 5జీ, ఐకూ జెడ్6 లైట్ 5జీల సేల్ మొదటి సారి ఈ ఫెస్టివల్‌లోనే జరగనుంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హెడ్ ఫోన్స్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. ఈ సేల్ జరిగినన్ని రోజులూ ప్రతి ఆరు గంటలకు ఒకసారి కొత్త డీల్స్‌ను రివీల్ చేయనున్నారు.
వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై రూ.15 వేలు డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ టీవీలపై ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందించారు. క్రాస్‌బీట్స్ టార్క్, బోట్ ఎయిర్‌పోడ్స్‌లు కూడా తక్కువ ధరకే లభించనున్నాయి.
ఈ ఫెస్టివల్ సమయంలోనే ఐఫోన్ 14 సిరీస్ సేల్ మొదటిసారి జరగనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో సిరీస్‌ల ప్రీ-ఆర్డర్లను యాపిల్ ఇటీవలే ప్రారంభించింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వేర్వేరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్ల ద్వారా వీటిని ఆర్డర్ చేయవచ్చు. ఈ సిరీస్‌పై బ్యాంక్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
వీటిని ఎక్కడ ఆర్డర్ చేయవచ్చు?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ విషయాన్ని యాపిల్ తెలిపింది.
ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?