News
News
X

5G Services: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి!

భారత్‌లో ఎయిర్‌ టెల్ 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను మీరు పొందాలంటే జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లో 5G నెట్‌ వర్క్‌ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి.

FOLLOW US: 

క్టోబర్ 1న జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5G సేవలను ప్రారంభించారు. Airtel, Jio, Viతో సహా అన్ని ప్రధాన టెలికాంలు భారతదేశంలో తమ 5G సేవల రోల్ అవుట్ ప్లాన్‌లను రూపొందించాయి. Jio దసరా నుంచి 5 నగరాల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు 5G సేవలను అందిస్తోంది. Vi త్వరలో రోల్‌ అవుట్‌ను ప్రారంభించబోతోంది. Airtel ఇప్పటికే  ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, హైదరాబాద్ తో పాటు చెన్నై నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. అంతేకాదు.. తమ ప్రస్తుత 4G సిమ్‌లు 5G నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటాయని Airtel ప్రకటించింది. మిగతా కంపెనీలతో పోల్చితే కస్టమర్లకు ముందుగా 5G సేవలను అందుబాటులోకి తేవడంతో Airtel సక్సెస్ అయ్యింది. చాలా కాలంగా 5G సేవల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు ఇప్పుడు వాటిని వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు.

5G అంటే ఏంటి?

5G నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించే లేటెస్ట్ టెక్నాలజీ.  5G నెట్‌వర్క్‌ ఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. 4G జీ కంటే 50 రెట్లు వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా గణనీయంగా పెంచుతుంది. 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ భారీగా పెరుగుతుంది. 5G టెక్నాలజీ మూలంగా స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీల్లో కీలక ముందగుడు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G టెక్నాలజీ అందుబాటులో ఉంది. తాజాగా భారత్ లో అందుబాటులోకి వచ్చింది.  

స్మార్ట్ఫోన్లో 5G నెట్వర్క్ని ఎలా యాక్టివేట్ చేయాలి?

ఆయా సెల్యులార్ కంపెనీలు 5G సేవలను మీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత.. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ ను కలిగి ఉంటే.. 5G నెట్ వర్క్ ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. 5G నెట్ వర్క్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి.

News Reels

⦿ ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ‘Settings’  ఓపెన్ చేయండి.

⦿ ఆ తర్వాత  ‘Mobile network’ను సెలెక్ట్ చేయండి.

⦿ మీరు 5Gని ప్రారంభించాలనుకుంటున్న SIMను ఎంచుకోవాలి. 

⦿ ఆ తర్వాత  ‘Preferred network type’ను ఎంపికను ఎంచుకోవాలి.

⦿ ఇప్పుడు ‘కేవలం  5G నెట్‌వర్క్’ రకాన్ని ఎంచుకోండి.

⦿ మీ ప్రాంతంలో  5G అందుబాటులోకి వచ్చినట్లయితే, మీరు స్టేటస్ బార్‌ లో  5G సింబల్ ను పొందే అవకాశం ఉంటుంది.   

Airtel 5Gని ఎవరు ఉపయోగించవచ్చు?

వ్యక్తిగత వినియోగదారుల కోసం 5Gని ఉపయోగించడానికి.. ముందుగా మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేసుందో లేదో తెలుసుకోవాలి. మీ హ్యాండ్‌సెట్ 5Gకి సపోర్టు చేసేది అయి ఉంటే.. Airtel 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుందని నిర్దారించుకోవాలి. ఈ సమాచారాన్ని రిటైల్ బాక్స్, లేదంటే తయారీదారు వెబ్‌సైట్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుంది.  మీరు 5G  అనుకూల స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండి, 5G సేవలు ప్రారంభించిన ప్రదేశంలో నివసిస్తే, యాక్టివ్ 5G రీఛార్జ్ ప్లాన్ ను కలిగి ఉండాలి.  అప్పుడు 5G సేవలు పొందే అవకాశం ఉంటుంది.

Published at : 06 Oct 2022 12:14 PM (IST) Tags: 5G services 5G Network activate 5G network smartphone users

సంబంధిత కథనాలు

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్