Aadhaar Card Photo Update: ఆధార్ కార్డులో మీ ఫోటో నచ్చలేదా? ఈజీగా మార్చుకోవచ్చు - ఇదిగో ఇలా చేయండి
మీ ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చక్కటి ఫోటోను అప్ డేట్ చేసుకోవచ్చు.
దేశంలోని పౌరులందరికీ భారత ప్రభుత్వం ఆధార్ కార్డు అందజేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి భారతీయుడికి 12 అంకెలతో ఆధార్ కార్డును అందించింది. ఈ ఆధార్ కార్డు మనకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఒకటిగా మారిపోయింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నా, ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాల్సిందే. ప్రతి అంశానికి ఇప్పుడు ఆధార్ లింక్ మస్ట్ అయ్యింది. దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన వివరాలు సదరు వ్యక్తి ఆధార్ కార్డులో ఉంటాయి.
ఆన్ లైన్ ద్వారా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు
ప్రస్తుతం ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ. చాలా అంశాలను ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయస్సు, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిలేషన్‌షిప్ లాంటి డెమోగ్రఫిక్ సమాచారాన్ని సొంతంగా ఆన్ లైన్ ద్వారా అప్ డేట్ చేసుకోవచ్చు.
#AadhaarEssentials
— Aadhaar (@UIDAI) June 8, 2020
You can update your name, address and date of birth in Aadhaar using a valid supporting document (see list here: https://t.co/BeqUA07J2b). No document required for mobile number, email Id, gender, photograph or other biometric update. pic.twitter.com/m0T1mNB3nN
ఫోటో అప్ డేట్ కోసం కచ్చితంగా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే!
బయోమెట్రిక్ సమాచారం అంటే, ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, ఫోటో కూడా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, వీటిని మార్చుకోవాలంటే ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు. కచ్చితంగా దగ్గర లోని ఆధార్ సేవా సెంటర్ కు వెళ్లాల్సిందే. అంతకు ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in కు వెళ్లాలి. ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఫాం డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో అడిగిన పూర్తి వివరాలను నింపాలి. ఈ ఫామ్ తీసుకుని ఆధార్ సెంటర్ కు వెళ్లాలి. అక్కడ మీ ఫోటో మరోసారి తీసుకుంటారు. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఫోటో అప్ డేట్ అవుతుంది.
#AadhaarEssentials
— Aadhaar (@UIDAI) April 19, 2019
You can update your details in Aadhaar using a valid supporting document (see list here: https://t.co/BeqUA07J2b) in your name. No document required for mobile number, email Id, Gender, Photograph or other biometric update. pic.twitter.com/FhmWqHZT9d
ఆధార్ కార్డులో ఫోటో మార్పు కోసం ఈ స్టెప్స్ ఫాలోకండి
1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్(https://uidai.gov.in)ను ఓపెన్ చేయండి.
2. ఆధార్ ఎన్‌రోల్ మెంట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
3. అవసరమైన అన్ని వివరాలను అందులో నింపండి.
4. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్లి ఫామ్‌ను సమర్పించండి.
5. అక్కడ మీ కొత్త ఫోటోను తీసుకుంటారు.
6. ఇందుకోసం రూ. 100 రుసుము చెల్లించాలి.
7. మీరు రసీదుతో పాటు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) తీసుకోండి.
8. ఈ URNతో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఫోటో అప్ డేట్ కోసం గరిష్టంగా 90 రోజులు పట్టవచ్చు. అప్పటిలోగా అప్ డేట్ కాకపోతే సంబంధించి ఆధార్ సెంటర్ కు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
Read Also: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది