5G rolled out in India: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?
భారత్ లో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో 5G సేవలకు సంబంధించి తలెత్తే ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా 5G సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయా టెలికాం ప్రొవైడర్లను 5G సేవలను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 నగరాల్లోని వినియోగదారులు తర్వాతి తరం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందుకుంటున్నారు. ఈ నుపథ్యంలో 5G రోల్ అవుట్, స్మార్ట్ ఫోన్ వినియోగం సహా పలు విషయాల గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
*5G అంటే ఏమిటి?
5G అనేది మొబైల్ నెట్ వర్క్ లో ఐదవ తరం. ఇప్పటికే 2G, 3G, 4G అనే మోబైల్ నెట్ వర్క్ లను వినియోగించి ఇప్పుడు 5Gలోకి అడుగు పెట్టాం. ఇందులో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒకే నెట్ వర్క్ కు మల్టీఫుల్ పరికరాలు కనెక్ట్ చేసినా వేగంగా ఇంటర్నెట్ సేవలను పొందగలుగుతారు.
*5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా?
5G వచ్చినా 4G ముగిసిపోదు. మనం 3Gతో చూసినట్లుగా 4G రాబోయే సంవత్సరాల్లో ఉంటుంది. మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3G సేవలను అందిస్తున్నారు. కాబట్టి 5G అంటే 4G అంతం కాదు.
*దేశంలో తొలుత 5G ఏ నగరాలకు అందుబాటులో ఉంటుంది?
మొదటి దశలో 5G రోల్ అవుట్ కోసం కేటాయించబడిన నగరాల్లో.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, వారణాసి, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌నగర్, గాంధీనగర్, ముంబై, పూణే, లక్నో, కోల్‌కతా, సిలిగురి, గురుగ్రామ్, హైదరాబాద్ ఉన్నాయి.
*దేశంలోని ఇతర ప్రాంతాలకు 5G ఎప్పుడు లభిస్తుంది?
రాబోయే కొన్నేళ్లలో దేశ వ్యాప్తంగా 5Gని అందించాలని టెలికాం ఆపరేటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇతర పెద్ద నగరాలు రాబోయే కొద్ది నెలల్లో 5Gని అందుబాటులోకి తీసుకొస్తారు.
*4Gతో పోలిస్తే 5G ఎంత వేగంగా ఉంటుంది?
4G స్పీడ్, ప్రాంతాలు, కనెక్టివిటీని బట్టి 40-50 Mbps వరకు అందించవచ్చు, అయితే 5G సేవలు 300 Mbps, అంతకంటే ఎక్కువ వేగంతో అందుకోవచ్చు. ఈ వేగం అనేది నెట్ వర్క్ ను బట్టి మారుతుంది.
*5G సేవలను ఉపయోగించడానికి కొత్త SIM అవసరమా?
5G కోసం కొత్త SIM అవసరం లేదు. 5G సపోర్టు చేసే ఫోన్లలో ప్రస్తుత SIM కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
*5G సేవలను పొందడానికి కొత్త ఫోన్ అవసరమా?
5G సేవలు పొందాలంటే కచ్చితంగా 5G సపోర్టు చేసే ఫోన్ అవసరం.
*5G స్పెక్ట్రమ్ అంటే ఏంటి?
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ కస్టమర్లకు అందించే 5G సర్వీస్ రకంలో స్పెక్ట్రమ్ కీలక పాత్ర పోషిస్తుంది. హై-బ్యాండ్ స్పెక్ట్రమ్ తో అత్యంత వేగవంతమైన వేగాన్ని అందించవచ్చు. కానీ, చక్కటి కవరేజ్ ఏరియాలో ఉండాలి. ఈ నేపథ్యంలో 5G స్పెక్ట్రమ్ అనేది అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలను అందించే తరంగ సముదాయంగా చెప్పుకోవచ్చు.
*లో-బ్యాండ్, మైండ్-బ్యాండ్, హై-బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటి?
1Ghz కంటే తక్కువ ఉన్న స్పెక్ట్రమ్ లో-బ్యాండ్ స్పెక్ట్రమ్‌గా పరిగణించబడుతుంది. 1 GHz - 6 GHz పరిధిలోని స్పెక్ట్రమ్ మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌గా పరిగణించబడుతుంది . స్పెక్ట్రమ్ చార్ట్‌లో 26 GHz కంటే ఎక్కువ ఏదైనా ఉంటే అది హై-బ్యాండ్ స్పెక్ట్రమ్‌గా పరిగణించబడుతుంది.
* దేశంలో 5Gని ఏ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి?
Samsung: అన్ని Galaxy S-సిరీస్ ఫోన్‌లు (S20, FE, A-సిరీస్, M-సిరీస్ మోడళ్లు)
Xiaomi: Redmi Note 11T, Redmi Note 11 Pro+, Mi 10 సిరీస్, Redmi Note 10T, Xiaomi 12-సిరీస్, Xiaomi 11-సిరీస్
Apple: iPhone 12 సిరీస్, iPhone 13 సిరీస్, iPhone SE (2022)
Oppo: కొన్ని A-సిరీస్, F-సిరీస్, K-సిరీస్, రెనో 6, 7, 8 సిరీస్
OnePlus: OnePlus 8-సిరీస్, OnePlus 9-సిరీస్, OnePlus 10-సిరీస్, Nord సిరీస్
Realme: Realme 8, 8 Pro (5G), 8s, Narzo 30, Narzo 50 (5G వేరియంట్లు), GT సిరీస్, GT2, X7 సిరీస్
Vivo: Vivo X-సిరీస్, V23 సిరీస్, V21 సిరీస్
Read Also: 5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు, డౌన్ లోడ్ స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవుతారు