By: ABP Desam | Updated at : 21 Mar 2023 05:49 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫోటోగ్రఫీ మీద మక్కువ బాగా పెరిగింది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త షాట్స్ తీయాలని పరితపిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. అదిరిపోయే ఏరియల్ షాట్స్ తో పాటు సూపర్ డూపర్ ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు. అయితే, చాలా మందికి డ్రోన్స్ తీసుకోవాలి అనుకున్నా, చాలా ధర ఉంటుందేమోనని భయపడుతున్నారు. కానీ, ఇప్పుడు తక్కువ ధరలోనూ చక్కటి డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేలకు లోపు కూడా మంచి డ్రోన్ కెమెరాలు లభిస్తున్నాయి. టాప్ బ్రాండ్‌లపై 59% వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. ఇంతకీ ఆ డ్రోన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. హిల్‌స్టార్ అబ్స్టాకిల్ అవాయిడెన్స్ డ్రోన్ కెమెరా - Rs.6,199
తక్కువ ధరలో డ్రోన్ కెమెరా తీసుకోవాలి అనుకునే వారికి ఈ ప్రొడక్ట్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 4-యాక్సిస్ డ్యూయల్ కెమెరా, విజువల్ హోవర్‌ని కలిగి ఉన్న ఈ ఫోల్డబుల్, వైఫై-ఎనేబుల్డ్ డ్రోన్ కెమెరా ద్వారా ఐడియల్ ఏరియల్ షాట్ క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ కెమెరా. ఇది చాలా తక్కువ బరువు, పరిమాణంతో ఉంటుంది. ఈ డ్రోన్ పోర్టబిలిటీ, కాంపాక్ట్‌నెస్ ట్రావెల్ వ్లాగింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తరుచుగా వెకేషన్స్ కు వెళ్లే వారికి చాలా బాగుంటుంది.
2. చావాలా ఏజెన్సీ పయనీర్ ఫోల్డబుల్ డ్రోన్ కెమెరా - Rs.6,499
ఈ తేలికపాటి డ్రోన్ కెమెరా సుమారు యాపిల్ అంత బరువు ఉంటుంది. మీ అరచేతిలో సరిపోయేంత పరిమాణంలో ఉంటుంది. మీతో ఎక్కడికైనా ఈ డ్రోన్ ను సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వైఫై డ్రోన్ కెమెరాలో ఫోల్డబుల్ డిజైన్, 360-డిగ్రీ ఫ్లిప్ స్టంట్, హోవరింగ్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి. ఈ డ్రోన్ కెమెరా పర్ఫెక్ట్ సెల్ఫీ, లేదంటే షాట్ ఇవ్వడానికి డ్యూయల్ HD లెన్స్ తో వస్తుంది.
3. నిలయ్ గరుడ డ్రోన్ కెమెరా- Rs. 9,899
ఈ పోర్టబుల్ డ్రోన్ కెమెరా అడాప్టబిలిటీ అన్ని రకాల వీడియో ప్రొడక్షన్‌కు పని చేస్తుంది. ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంటుంది. రెండు లైట్లు, బలమైన మోటార్లు ఉంటాయి. ఆప్టికల్ ఫ్లో ఫంక్షన్ కారణంగా, సీన్ పాయింట్ ఇమేజ్‌లు మరింత వేగంగా కదులుతాయి. ఈ డ్రోన్ హ్యాండ్ గెస్చర్ ఫీచర్ తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 30 నిమిషాల వరకు గాలిలో 50 మీటర్ల వరకు ఎగురుతుంది.
4. భయాని గరుడ డ్యూయల్ కెమెరా డ్రోన్- Rs. 9,999
ఇది కూడా వైఫై-ఎనేబుల్డ్ డ్రోన్ కెమెరా. ఇది చాలా తేలికైనది. రెండు కెమెరాలు, శక్తివంతమైన మోటారు, వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్‌లో కూడా హ్యాండ్ గెస్చర్ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది. సెల్ఫీలు తీసుకోవడం సులభంగా ఉంటుంది. ఈ డ్రోన్ కెమెరా 30 నిమిషాల వరకు పనిచేస్తుంది. ఇది గాలిలో 50 మీటర్ల వరకు ఎగురుతుంది.
5. మార్వెల్లా గరుడ పొజిషన్ లాకింగ్ డ్రోన్ కెమెరా- Rs. 9,999
ఈ డ్రోన్ కెమెరా క్వాడ్‌కాప్టర్, ట్రాన్స్ మీటర్, మొబైల్ స్టాండ్, 4 ఇన్‌స్టాల్ చేయబడిన ప్రొపెల్లర్లు, బాక్స్ లోపల మరికొన్ని వస్తువులతో వస్తుంది. ఇది 720p కెమెరా, 360-డిగ్రీ ఫ్లిప్, హెడ్‌లెస్ మోడ్, ఫోల్డబుల్ తో వస్తోంది. ఫోటోలు, వీడియోలను తీయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
Read Also: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?
WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
MacBook Air: ఇంటెల్ ల్యాప్టాప్ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్బుక్ లాంచ్ చేసిన యాపిల్!
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!