News
News
X

Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం..

FOLLOW US: 
Share:

స్మార్ట్‌ వాచ్‌లు కేవలం ఫిట్‌నెస్ పరికరాలు మాత్రమే కాకుండా స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారాయి. అందుకే పలు కంపెనీ రూ.2 వేల నుంచి రూ. 5 వేల వరకు బెస్ట్ స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి  పరిచయం చేస్తున్నాయి. కాల్ ఫంక్షన్‌, ECG ట్రాకర్‌తో కూడిన పలు స్మార్ట్ వాచ్ లు వినియోగారులకు విరివిగా లభిస్తున్నాయి. అయితే, మీరు రూ. 2 వేల వరకు మంచి స్మార్ట్ కోసం వెతుకుతున్నట్లే జస్ట్ ఈ లిస్టు చూడండి. నచ్చింది తీసుకోండి.

1. బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్

బోట్ నుంచి బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది. 550 NITS,  1.69-అంగుళాల పూర్తి HD టచ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇతర స్మార్ట్‌ వాచ్‌ల మాదిరిగా కాకుండా, ఇది అంతర్నిర్మిత స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది వినియోగదారులు జర్నీలో ఉండగా కాల్స్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, Sp2O ట్రాకర్ కూడా ఉన్నాయి. వినియోగదారులు రన్నింగ్, సైక్లింగ్, క్లైంబింగ్, యోగా బ్యాడ్మింటన్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్‌ల నుండి ఎంచుకోవచ్చు.

2. నాయిస్ కలర్‌ ఫిట్ పల్స్ స్మార్ట్‌ వాచ్

నాయిస్ కలర్‌ ఫిట్ పల్స్ వాచ్ 1.4-అంగుళాల ఫుల్-టచ్ HD డిస్‌ ప్లే, 10 రోజుల బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ వాచ్ Android, iOS ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది వినియోగదారుల సాధారణ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించే సెన్సార్లతో వస్తుంది.  స్పోర్ట్స్ మోడ్‌లలో కేలరీలను ట్రాక్ చేస్తుంది. అవుట్‌డోర్ అడ్వెంచర్‌లకు అనుకూలంగా ఉంటుంది.   

3. Zebronics Zeb-FIT3220CH స్మార్ట్ ఫిట్‌ నెస్ వాచ్

ఈ స్మార్ట్ వాచ్ 1.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫిట్‌ నెస్-ఫోకస్డ్ స్మార్ట్‌ వాచ్. ఇది బీపీని, హార్ట్ బీట్ ను పర్యవేక్షిస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు గురించి  తెలియజేస్తుంది. ఇది స్టైలిష్, సొగసైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ వాచ్ వాటర్ రిసిస్టెంట్ గా పని చేస్తోంది.   

4. ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్‌ వాచ్

ఈ స్మార్ట్ వాచ్ అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్‌ తో కాల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1.39-అంగుళాల TFT టచ్ స్క్రీన్,  240 X 240 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో డిస్ ప్లేను కలిగి ఉంటుంది.  ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో గట్టి బాడీని కలిగి ఉంటుంది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.  ఈ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంది.  ఇది మీ ఫోన్‌లో సిరి/గూగుల్‌ని ఒక్క ట్యాప్‌తో యూజ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.   

5. TAGG వెర్వ్ NEO స్మార్ట్‌ వాచ్  

500 NITS  బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. మహిళలకు సంబంధించిన ఋతు చక్రాన్ని కూడా ట్రాక్ చేస్తోంది. ఇది మీ వ్యాయామాలు, రోజు వారీ కార్యాచరణను ట్రాక్ చేస్తోంది. మీ నిద్ర నాణ్యతను కూడా ట్రాక్ చేస్తోంది.   

6. కొత్త ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ బీట్+  స్మార్ట్‌ వాచ్

ఇది 1.6 అట్రా యూవీ డిస్ ప్లే తో వస్తుంది.   స్మార్ట్‌ వాచ్‌లో మొత్తం 60 కొత్త ఇన్ బిల్ట్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో హెల్త్ ట్రాకర్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి.   

7. PTron Force X12N  స్మార్ట్‌ వాచ్

ఈ స్మార్ట్ వాచ్‌లో 5 గేమ్‌లు, స్మార్ట్ హెల్త్/ఫిట్‌నెస్ ట్రాకర్, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలారం, స్టెప్ కౌంట్, బర్న్ చేయబడిన కేలరీలతో పాటు 8 స్పోర్ట్ మోడ్‌లు ఉన్నాయి. ఇది వాయిస్ డిటెక్షన్,  అలారం క్లాక్  కలిగి ఉంది.  అంతర్నిర్మిత మైక్రోఫోన్,స్పీకర్, బ్లూటూత్ కలిగి ఉంటుంది.

8. హామర్ పల్స్ ఏస్ ప్రో స్మార్ట్‌ వాచ్

ఈ స్మార్ట్ వాచ్ 240 x 286 బ్రైట్ నెస్ రిజల్యూషన్‌తో 1.81-అంగుళాల డిస్‌ ప్లేను కలిగి ఉంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అల్యూమినియం అల్లాయ్ బాడీని కలిగి ఉంది. బెస్ట్ కాలింగ్ అనుభవం కోసం మైక్రోఫోన్, స్పీకర్‌తో అమర్చబ ఉంది.   శక్తివంతమైన బ్యాటరీ స్టాండ్‌బైలో 7 రోజులు ఉంటుంది.  M2 Wear యాప్‌తో Android, iOS ఫోన్‌లతో పని చేస్తుంది.

Read Also: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

Published at : 12 Mar 2023 07:27 PM (IST) Tags: smartwatch under 2000 men Smartwatch women Smartwatch

సంబంధిత కథనాలు

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు,  జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!