By: ABP Desam | Updated at : 04 Mar 2023 11:44 PM (IST)
మహిళల ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. (Image Credits: WPLT20 Twitter)
Gujarat Giants vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చుక్కలు చూపించిన ముంబై బౌలర్లు
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్‌లో అస్సలు ఏదీ కలిసి రాలేదు. మొదటి ఓవర్లోనే కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (0: 3 బంతుల్లో) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. అదే ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (0: 2 బంతుల్లో) కూడా అవుట్ అయింది. ఆ తర్వాత కూడా గుజరాత్ వికెట్లు కోల్పోతూనే ఉంది.
ఒక దశలో కేవలం 23 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (49) రికార్డు బద్దలవుతుంది అనుకున్నారు. కానీ దయాళన్ హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టెయిలెండర్లతో కలిసి పోరాడి ఆ అవమానాన్ని మాత్రం తప్పించగలిగింది. ఆఖర్లో టెయిలెండర్లు కూడా వరుసగా అవుట్ కావడంతో గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ముంబైకి ఆశించిన ఆరంభం లభించలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ యస్తిక భాటియా (1: 8 బంతుల్లో) మూడో ఓవర్లో అవుట్ అయింది.
హర్మన్ వండర్ ఇన్నింగ్స్
మరో ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (47: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ నటాలీ స్కీవర్ బ్రంట్ (23: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఒక్క ఓవర్ వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. దీంతో 10 ఓవర్లలో 77 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. ప్రస్తుత భారత జట్టుకు, అలాగే ముంబై ఇండియన్స్‌కు కూడా కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) చెలరేగి ఆడింది. గుజరాత్ బౌలర్లపై స్వీప్ షాట్లతో విరుచుకుపడింది. అగ్నికి వాయువు తోడౌనట్లు హర్మన్ ప్రీత్ కౌర్‌కు అమీలియా కెర్ (45 నాటౌట్: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) తోడైంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు.
హర్మన్ ప్రీత్ చేసిన 65 పరుగుల్లో 56 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. 17వ ఓవర్ చివరి బంతికి హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. కానీ చివర్లో పూజా వస్త్రాకర్ (15: 8 బంతుల్లో, మూడు ఫోర్లు), ఇసీ వాంగ్ (6 నాటౌట్: ఒక బంతి, ఒక సిక్సర్) స్కోరు వేగం తగ్గనివ్వలేదు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి.
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!
IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?