T20 World Cup: భారత్ సెమీస్ అవకాశాలపై ఫన్సీ మీమ్ షేర్ చేసిన జాఫర్.. ఉరి తప్పాలంటే?
టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ సమీకరణాలు కాస్త క్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ దీన్ని ఒక మీమ్ ద్వారా సులభంగా వివరించారు.
టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం నెలకొన్న సమీకరణాలు, ఈ నెట్ రన్‌రేట్ లెక్కలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నాయి. ఎంతో కష్టంగా అనిపించి మ్యాథ్స్ పరీక్షకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రస్తుతం సమీకరణాలు ఉన్నాయి. అయితే మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ సమస్యను సులభంగా పరిష్కరించారు.
ఒక బాలీవుడ్ సినిమా మీమ్ ద్వారా వసీం జాఫర్ దీన్ని వివరించారు. ధమాల్ అనే బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మీమ్ ద్వారా భారత్, ఆస్ట్రేలియాల సెమీస్ భవితవ్యాన్ని సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. ఒక వ్యక్తి చావు.. మరో వ్యక్తి తీసుకునే చర్యలపై ఆధారపడి ఉండే సన్నివేశాన్ని వసీం జాఫర్ షేర్ చేశారు.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 గ్రూప్ 2లో భారత్ ఆశలు ఆఫ్ఘనిస్తాన్ పైన, ఆస్ట్రేలియా ఆశలు ఇంగ్లండ్ పైన ఉన్నాయి. టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా ముందుకు వెళ్లాలంటే ఆఫ్ఘన్, ఇంగ్లండ్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే.
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ సమీకరణాల కోసం జుట్టు పీక్కుంటున్న ఎంతో మంది క్రీడాభిమానుల ప్రశ్నలకు జాఫర్ ఒక కామెడీ పోస్టుతో సమాధానం చెప్పినట్లు అయింది. గ్రూప్ 1లో ఇంగ్లండ్, గ్రూప్ 2లో భారత్ ఇప్పటికే సెమీఫైనల్‌కు క్వాలిఫై అయ్యాయి.
ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్న ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తేనే టీమిండియాకు అవకాశం ఉంటుంది.
Current situation 😅: India and AUS not only need to win but need AFG and ENG to win too for certain/easier passage. #T20WorldCup pic.twitter.com/6K6x0q7ogs
— Wasim Jaffer (@WasimJaffer14) November 6, 2021
Also Read: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి