అన్వేషించండి

' బాగా ఆడినా డగౌట్ లో కూర్చోవడం కష్టమే'

వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే తన చేతుల్లో ఉందని టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. బాగా ఆడిన తర్వాత కూడా డగౌట్ లో కూర్చోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని తెలిపాడు.

రెండు మ్యాచులు ఆడిన తర్వాత డగౌట్ లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుందని టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 10 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు అక్షర్. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ స్పిన్నర్ జట్టులో తన స్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

డగౌట్ లో కూర్చోవడం కష్టమే

రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత కూడా డగౌట్ లో కూర్చోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని అక్షర్ పేర్కొన్నాడు. అయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తన చేతిలో ఉందన్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను ఇక్కడ బాగా రాణిస్తే, తర్వాతి గేమ్ ఆడతానని అన్నాడు. ఒకవేళ బాగా ఆడినా తర్వాతి మ్యాచుకు అవకాశం రాకపోయినా దానినీ సానుకూలంగానే తీసుకుంటానని అక్షర్ తెలిపాడు. ఆ సమయంలో తనను తాను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తానన్నాడు.

 సుస్థిరం స్థానం కోసం పోటీ
 
ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ లోయర్ మిడిలార్డర్ లో ఉపయుక్తమైన పరుగులు చేయగలడు. అయినా కూడా ఆ స్థానంలో రవీంద్ర జడేజా కుదురుకోవటంతో ఇప్పటికీ అక్షర్ కు జట్టులో స్థానం సుస్థిరం కాలేదు. అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని 2014 నుంచి వన్డేల్లో 50 వికెట్లు పడగొట్టాడు అక్షర్.

పిచ్ స్పిన్నర్లకు సహకరించింది
సోమవారం జరిగిన వన్డేలో పిచ్ కొంచెం పొడిగా ఉందని.. స్పిన్నర్లకు సహకరించిందని తెలిపాడు. అవతలి ఎండ్ నుంచి స్టంప్స్ లైనులో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు. దీంతో బ్యాటర్ తప్పు చేసే అవకాశం ఉందని.. దాంతో వికెట్లు వస్తాయని అన్నాడు. 

గిల్ బ్యాటింగ్ ఆకట్టుకుంది
గిల్ బ్యాటింగ్ చేస్తున్న విధానం, సింగిల్స్ ను డబుల్స్ గా మార్చే విధానం ఆకట్టుకున్నాయని అక్షర్ తెలిపాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తాడని, డాట్ బాల్స్ ఎక్కువ ఆడడని తన సహచర ఆటగాడిని ప్రశంసించాడు. స్పిన్నర్లను బాగా ఆడతాడని.. స్వీప్, రివర్స్ స్వీప్ కూడా బాగా ఆడగలడని అన్నాడు. భారత బౌలింగ్ యూనిట్ గా తాము తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశామని చెప్పాడు. అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ యార్కర్లు, వైడ్ యార్కర్లు బాగా వేశారని అన్నాడు. 

భవిష్యత్తులో రిజర్వ్ బెంచ్ ను పటిష్టం చేయడం కోసం భారత మేనేజ్ మెంట్ యువకులకు అవకాశం కల్పిస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల పనిభారాన్ని నియంత్రించడం కోసం ఆటగాళ్లను రొటేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్షర్ ను జింబాబ్వే పర్యటనలో ఆడించింది. ఈ అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Pat Cummins Racism: కెప్టెన్సీపై ఖవాజా జాతి వివక్ష వ్యాఖ్యలు.. రంగు చూసి పగ్గాలు ఇస్తారన్న ఆరోపణలను తిప్పికొట్టిన కమిన్స్
కెప్టెన్సీపై ఖవాజా జాతి వివక్ష వ్యాఖ్యలు.. రంగు చూసి పగ్గాలు ఇస్తారన్న ఆరోపణలను తిప్పికొట్టిన కమిన్స్, ఆధారాలు చూపాలంటూ  కౌంటర్
IND Playing XI Vs NZ: కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
IND VS PAK Final: కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget