Virat kohli Press Conference: రోహిత్‌ను తప్పించి ఇషాన్‌కు చోటిస్తారా? మీడియా ప్రశ్నకు విరాట్ స్టన్..! ఎలా జవాబిచ్చాడో చూస్తారా!!
పాక్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలతో స్టన్ అయ్యాడు. రోహిత్‌ను ఎవరైనా తప్పిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించాడు.
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీతో సంచలన జవాబులు చెప్పించాలని మీడియా.. దొరక్కుండా తప్పించుకోవాలని అతడూ ప్రయత్నించడం కామనే! టీ20 ప్రపంచ కప్‌లో పాక్ చేతిలో ఓటమి తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ కోహ్లీకి మీడియా నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి.
జట్టు కూర్పు గురించి ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధి... ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను కాదని రోహిత్ శర్మ ని ఎందుకు ఆడించారు అని ప్రశ్నించడంతో కోహ్లీ అవాక్కయ్యాడు. ఆ తర్వాత విరాట్, మీడియా ప్రతినిధి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా అనిపించింది.
రిపోర్టర్: నా ప్రశ్న టీమ్ సెలక్షన్ గురించి. చాలా మంది దాని గురించే మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇషాన్ కిషన్ వార్మప్ మ్యాచ్ లలో బాగా ఆడాడు. అలాంటిది ఇషాన్‌ను కాదని రోహిత్ శర్మ ఆడించి తప్పు చేశారని మీరు భావిస్తున్నారా..?
కోహ్లీ : (ఆశ్చర్య పోతూ) చాలా ధైర్యంగా ప్రశ్నించారు. మీరేమనుకుంటున్నారు? నేను నా బెస్ట్ టీం తోనే ఆడానని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి?
రిపోర్టర్: నేను జస్ట్ అడుగుతున్నాను. మీ నిర్ణయం పై నాకు ఎలాంటి కామెంట్ లేదు.
కోహ్లీ : మీరు రోహిత్ శర్మను టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పించాలని అంటున్నారా.? తన చివరి మ్యాచ్లో ఎలా ఆడాడో చూసి కూడా ఈ ప్రశ్న వేస్తున్నారా. నిజంగా ఈ ప్రశ్నను నమ్మలేకపోతున్నా. మీకు నిజంగా ఏదైనా కాంట్రవర్సీ కావాలంటే నాకు ముందే చెప్పండి. దానికి తగినట్లుగా సమాధానం ఇస్తాను.
"Will you drop Rohit Sharma from T20Is?" 🤔@imVkohli had no time for this question following #India's loss to #Pakistan#INDvPAK #T20WorldCup pic.twitter.com/5ExQVc0tcE
— T20 World Cup (@T20WorldCup) October 25, 2021
పాక్‌తో మ్యాచుకు ముందూ విరాట్‌కు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నారు? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? అంటూ కొన్ని కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. అయితే అగ్నికి ఆజ్యం పోయడం తనకు ఇష్టం లేదంటూ తెలివిగా తప్పించుకున్నాడు. మ్యాచుకు ముందు ఎలాంటి సంచలన వ్యాఖ్యలూ చేయలేదు. ఈ మ్యాచు ముగిసిన తర్వాత కూడా కోహ్లీ ప్రశాంతంగా కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను హృదయపూర్వకంగా అభినందించాడు.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!
"Will you drop Rohit Sharma from T20Is?" 🤔@imVkohli had no time for this question following #India's loss to #Pakistan.#INDvPAK #T20WorldCup pic.twitter.com/sLbrq7z2PW
— ICC (@ICC) October 25, 2021