Sania Mirza: మాలిక్ సిక్సర్లు.. సానియా సంబరాలు..! వైరల్‌గా మారిన చిత్రాలు
పాక్ ఆటగాడు షోబయ్ మాలిక్ స్కాట్లాండ్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు. అప్పుడు స్టాండ్స్‌లోనే ఉన్న అతడి భార్య సానియా మీర్జా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వేగవంతమైన అర్ధశతకం చేశాడు. భారీ సిక్సర్లతో స్కాట్లాండ్‌పై విరుచుకుపడ్డాడు. తన భర్త ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేయడంతో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంబరాలు చేసుకుంది. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
షార్జా వేదికగా ఆదివారం స్కాట్లాండ్, పాకిస్థాన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 189/4 పరుగులు చేసింది. ఈ మ్యాచులో కీలక సమయంలో వచ్చిన షోయబ్ మాలిక్ తన సీనియారిటీని ప్రదర్శించాడు. 40 ఏళ్ల వయసులోనే అత్యంత వేగంగా అర్ధశతకం బాదేశాడు. కేవలం 18 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక బౌండరీ బాదేసి 54 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Want same confidence by your presence what Shoaib Malik got by presence of Sania Mirza! #PAKvsSCO pic.twitter.com/N6DhwiSgFW
— sam'z (@goolgaapa) November 7, 2021
ఇదే స్కా్ట్లాండ్‌పై కేఎల్ రాహుల్ చేసిన 18 బంతుల్లో అర్ధశతకాన్ని మాలిక్ సమం చేశాడు. మాలిక్ దంచికొడుతున్నప్పుడు అతడి సతీమణి సానియా మీర్జా స్టాండ్స్‌లోనే ఉంది. అతడు కొట్టే సిక్సర్లను ఎంజాయ్ చేసింది. చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది.
పాకిస్థాన్ తరఫున టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధశతకం చేసిన బ్యాటర్ షోయబ్ మాలికే. అంతకు ముందు ఉమర్ అక్మల్ 2010లో ఆస్ట్రేలియాపై 21, 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లోనే అర్ధశతకాలు చేశాడు. మొత్తంగా ఈ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు మాత్రం యువరాజ్ సింగ్ పేరుతో ఉంది. 2007లో అతడు 12 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టింది ఇదే మ్యాచులో కావడం విశేషం.
Watching #icct20worldcup2021 #PAKvSCO @MirzaSania @realshoaibmalik pic.twitter.com/boD730zcaR
— Munawar Malick (@munawarmalick) November 7, 2021
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sania Mirza's team was knocked out of the World Cup but she still enjoying her hubby batting 🤩🤩🤩 pic.twitter.com/njmX9bKco4
— S O H A I L👓 ( سہیل) (@Msohailsays) November 7, 2021