Afghanistan Vs Scotland: కూనల పోరు.. కానీ ఆసక్తికరమే!
నేడు టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ తలపడనున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షార్జా స్టేడియంలో జరగనుంది. క్వాలిఫయర్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన స్కాట్లాండ్ సూపర్ 12కు చేరుకుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తానే హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. వాళ్ల బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనిపిస్తుంది. రషీద్ ఖాన్, నబీ వంటి డేంజరస్ స్పిన్నర్లు షార్జా వికెట్‌పై ఎంతో ఉపయోగపడనున్నారు. అయితే స్కాట్లాండ్‌పై విజయం సాధించాలంటే ఆఫ్ఘన్ బ్యాటింగ్ లైనప్ కూడా అంచనాలకు మించి రాణించాల్సిందే.
మరో పక్క స్కాట్లాండ్ మాత్రం విజయాల పరంపరను కొనసాగించాలని భావిస్తోంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు కూడా షాకిచ్చిన రికార్డు స్కాట్లాండ్ సొంతం. అదే వారికి పాజిటివ్ ఫ్యాక్టర్‌గా మారుతోంది. స్కాట్లాండ్ బౌలింగ్ కూడా బలంగానే ఉంది. కాబట్టి ఆఫ్ఘన్ బ్యాటింగ్‌కు, స్కాట్లాండ్ బౌలింగ్‌కు మధ్య జరిగే పోరు ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ రెండు జట్లూ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2016 వరల్డ్ కప్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు మొత్తంగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆఫ్ఘనిస్తాన్ ఆరు సార్లూ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ షార్జా స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. స్కాట్లాండ్ తరఫున కెప్టెన్ కైల్ కోట్జర్, రిచర్డ్ బెరింగ్టన్ కీలకం కానున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ప్రభావం చూపించనున్నారు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్(95 అంతర్జాతీయ టీ20 వికెట్లు) నాలుగు వికెట్లు తీస్తే.. అత్యధిక వికెట్ల జాబితాలో అఫ్రిదిని(98 వికెట్లు) దాటుతాడు.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!