News
News
X

Hasaranga Hattrick in T20 WC: సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్.. అద్భుతం చేసిన సింహళ స్పిన్నర్!

శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వరుస బంతుల్లో, వేర్వేరు ఓవర్లలో ఈ ఫీట్ సాధించాడు.

FOLLOW US: 
 
శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన హసరంగ ఈ ఫీట్ సాధించాడు. అయినా ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది.

143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన 15వ ఓవర్ చివరి బంతికి 96 పరుగుల వద్ద మార్క్రమ్ వికెట్‌ను కోల్పోయింది. ఇది హసరంగకు మొదటి వికెట్. ఆ తర్వాత మళ్లీ 18వ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చి మొదటి రెండు బంతులకు బవుమా, ప్రిటోరిస్‌లను అవుట్ చేశాడు. దీంతో తన హ్యాట్రిక్ పూర్తయింది. అయితే చివర్లో డేవిడ్ మిల్లర్ రెండు సిక్సర్లతో దక్షిణాఫ్రికాను గెలిపించాడు.

ఈ వరల్డ్‌కప్‌లో ఇది రెండో హ్యాట్రిక్. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ మొదట ఈ ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో తను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. 2007 వరల్డ్ కప్‌లో బ్రెట్‌లీ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ కర్టిసే. 2007 నుంచి 2016 వరకు జరిగిన ఆరు వరల్డ్ కప్‌ల్లో ఒక్క హ్యాట్రిక్ మాత్రమే నమోదు కాగా... కేవలం ఈ కప్‌లోనే రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులను శంషి (3 వికెట్లు), ప్రిటోరియస్‌ (3 వికెట్లు), నార్జ్‌ (2 వికెట్లు) వణికించారు. ముగ్గురు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కానీ ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక(72: 58 బంతుల్లో) మాత్రం అద్భుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 20, రెండో వికెట్‌కు 40, నాలుగో వికెట్‌కు 15, ఐదో వికెట్‌కు 14, ఐదో వికెట్‌కు 19, ఆరో వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. చరిత్‌ అసలంక(21), దసున్‌ శనక (11) అతడికి తోడుగా నిలిచారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది.

News Reels

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రెజా హెండ్రిక్స్‌ (11), క్వింటన్‌ డికాక్‌ (12)ను ఒకే ఓవర్లో బంతి వ్యవధిలో చమీరా ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 26 పరుగులు మాత్రమే. మరికాసేపటికే డుసెన్‌ (16) రనౌట్‌ అవ్వడంతో కెప్టెన్‌ తెంబా బవుమా (46: 46 బంతుల్లో 1x4, 1x6) గెలుపు భారం మోశాడు. చివర్లో సఫారీలు 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో రబాడ (13*) ఓ సిక్సర్‌, ఆఖరి ఓవర్లో మిల్లర్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికా రెండో విజయం నమోదు చేసింది.

Also Read: AFG vs PAK, Match Highlights: పాకిస్తాన్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం

Also Read: T20 WC 2021, WI vs BANG Match Highlites: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ డిఫెండ్‌ చేసింది..! బంగ్లాపై 3 పరుగుల తేడాతో విండీస్‌ విజయం

Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!

Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Oct 2021 07:54 PM (IST) Tags: T20 World Cup 2021 Wanindu Hasaranga de Silva SL vs SA Wanindu Hasaranga Hattrick Wanindu Hasaranga Hattrick On SA Wanindu Hasaranga Hasaranga Hattrick

సంబంధిత కథనాలు

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

IPL 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!

IPL 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!

Ricky Ponting Health Issue: కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్‌కు హెల్త్‌ ఇష్యూ! హుటాహుటిన ఆస్పత్రికి పరుగు!

Ricky Ponting Health Issue: కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్‌కు హెల్త్‌ ఇష్యూ! హుటాహుటిన ఆస్పత్రికి పరుగు!

Most T20I Runs in 2022: ట్వంటీ22 మొనగాడు మిస్టర్‌ 360! రన్స్‌ ఫెస్ట్‌లో సూర్య తర్వాతే రిజ్వాన్‌, కోహ్లీ!

Most T20I Runs in 2022: ట్వంటీ22 మొనగాడు మిస్టర్‌ 360! రన్స్‌ ఫెస్ట్‌లో సూర్య తర్వాతే రిజ్వాన్‌, కోహ్లీ!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్