IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ అన్ని సిద్ధం చేస్తోంది. నవంబర్లోనే రీటెన్షన్ పూర్తవ్వనుంది. కొత్త జట్లు ముగ్గురిని తీసుకొనేందుకు అనుమతి ఇచ్చారు.
ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలు పెట్టేసింది! అప్పుడేనా అనుకోకండి! ఇప్పటికే రెండు కొత్త ఫ్రాంచైజీల విక్రయం పూర్తయింది. ఆటగాళ్ల రీటెన్షన్ విధానం ఈ నెలాఖరులో మొదలవుతుంది. ఆ తర్వాత వేలమే..!
అనధికార చర్చ
బీసీసీఐ వద్ద రీటెన్షన్ గురించి ఫ్రాంచైజీలు ఇప్పటికే అనధికారికంగా చర్చించాయి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లు నలుగురు ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చని తెలిసింది. అంటే 32 మందిని తీసుకోగా మిగిలిన వారిలో తలో ముగ్గుర్ని వేలంతో సంబంధం లేకుండా కొత్త జట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం రూ.90 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చు.
ఎంత మందికి ఛాన్స్
ముగ్గురు భారతీయులు, ఒక విదేశీయుడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులను ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకోవచ్చు. ఈ ముగ్గురు భారతీయులు జాతీయ జట్టుకు ఆడినా, ఆడకపోయినా ఫర్వాలేదు. 2018 తరహాలో రైట్ టు మ్యాచ్ కార్డును వేలంలో ఉపయోగించేందుకు అవకాశం లేదు.
కొత్త జట్లకు ఇలా
రీటెయిన్ చేసుకోగా మిగిలిన వారిలో కొత్త జట్లు ఎంపిక చేసుకున్నాక ఆటగాళ్ల ముసాయిదా తయారు చేస్తారు. 2016లోనూ ఇలాగే చేశారు. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నా తుది నిర్ణయం మాత్రం ఆటగాళ్లదే. ఆ జట్టులో కొనసాగాలా వద్దా అనేది అతడి ఇష్టాన్ని బట్టే ఉండనుంది. కాగా రీటెన్షన్ కోసం ఫ్రాంచైజీలు ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చో ఇంకా నిర్ణయించలేదు. 2018లో మాత్రం రూ.80 కోట్ల పర్స్‌లో రూ.33 కోట్లు వెచ్చించడం గమనార్హం.
రాహుల్‌కు భారీ ధర
ఎంఎస్ ధోనీ మరో ఏడాది తమకే ఆడతాడని చెన్నై సూపర్‌కింగ్స్ స్పష్టం చేసింది. ధోనీ లేకుండా చెన్నై లేదని చెన్నై లేకుండా ధోనీ లేడని చెప్పేశారు. కోహ్లీ కెప్టెన్‌గా దిగిపోతున్నప్పటికీ వీడ్కోలు పలికే వరకు బెంగళూరుకే ఆడతానని అన్నాడు. పంజాబ్ కింగ్స్ నుంచి కేఎల్ రాహుల్ విడిపోతున్నాడని సమాచారం. వేలంలోకి వెళ్తే మాత్రం అతడికి భారీ ధర దక్కనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్‌కు సైతం డిమాండ్ ఎక్కువగానే ఉంది.
Also Read: AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంకను చిత్తు చేసిన ఆసీస్
Also Read: Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?
Also Read: Shami Latest News: పాక్ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్.. ఇవిగో సాక్ష్యాలూ..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి