AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంకను చిత్తు చేసిన ఆసీస్
ICC T20 WC 2021, AUS vs SL: శ్రీలంకతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ ఫాంలోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. నాలుగు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తడబడ్డ శ్రీలంక బ్యాట్స్‌మెన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పతూం నిశ్శంక (7: 9 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత కుశాల్ పెరీరా (35: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), అసలంక (35: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) శ్రీలంకను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించిన అనంతరం పదో ఓవర్లో అసలంక అవుటయ్యాడు.
అనంతరం వెంటనే 11వ ఓవర్లో కుశాల్ పెరీరా కూడా అవుటయ్యాడు. అక్కడితో వికెట్ల పతనం ఆగలేదు. 12వ ఓవర్లో అవిష్క ఫెర్నాండో, 13వ ఓవర్లో వనిందు హసరంగ అవుటవ్వడంతో శ్రీలంక 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత భనుక రాజపక్స (33 నాటౌట్: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకోవడంతో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హజిల్‌వుడ్, జంపా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
డేవిడ్ వార్నర్ షో..
155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. డేవిడ్ వార్నర్ (65: 42 బంతుల్లో, 10 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (37: 23 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (5: 6 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అనంతరం స్టీఫెన్ స్మిత్ (28 నాటౌట్: 26 బంతుల్లో, ఒక ఫోర్), డేవిడ్ వార్నర్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ పూర్తయింది.
స్కోరు వేగం పెంచే క్రమంలో డేవిడ్ వార్నర్ అవుటయనా, స్టీఫెన్ స్మిత్, స్టోయినిస్ (16 నాటౌట్: 7 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి 17 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు తీయగా.. షనకకు మరో వికెట్ దక్కింది.
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?